‘పవన్ కళ్యాణ్’ కోసం వెయిట్ చేస్తోన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!!

0
28

బాలీవుడ్ లో ఒకవైపు స్టార్ హీరోయిన్ గా.. మరోవైపు ఐటమ్ గర్ల్ గా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అంతేకాదు ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంతగా టాలీవుడ్‌లో విజయం సాధించకపోయినా.. ఆమె కనిపించిన పాటకు మాత్రం మంచి రెస్పాన్సే వచ్చింది.

ఆ సినిమా తర్వాత జాక్వలిన్ పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో కనిపించేందుకు రెడీ అయింది. ఆ చిత్రం మరేదో కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రియేటివ్ దర్శకుడు క్రిష్, సంచలన నిర్మాత ఏ.ఎమ్. రత్నం కాంబినేషన్‌లో రూపొందుతోన్న పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రస్తుతం ఈ చిత్రం కొంత పార్ట్ షూటింగ్‌ని చిత్రీకరణ జరుపుకుంది. పవన్ కల్యాణ్‌ కరోనాకు గురికావడంతో ఈ చిత్రంతో పాటు, ఆయన చేస్తోన్న మరో చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ షూటింగ్‌కి కూడా బ్రేక్ పడింది.

అంతకుముందు పవన్ ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపారు. తాజాగా ‘హరిహర వీరమల్లు’ చిత్రం గురించి జాక్వలిన్ తన తాజాగా ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.”టాలీవుడ్‌లో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రం చేస్తున్నాను. ఆ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు వెయిట్ చేస్తున్నాను. షూటింగ్స్ సజావుగా సాగి, దర్శకుడు ఎప్పుడంటే అప్పుడు ఆ చిత్ర షూట్‌లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నాను.

ఆ మూవీ తర్వాత టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను..” అని జాక్వలిన్ ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.. ఇక ఇదిలా ఉంటె ప్రస్తుతం కరోనాతో సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి.. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు క్రిష్ మాత్రం నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించి లొకేషన్స్ ని వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక పరిస్థితులు అన్ని చక్కబడిన తర్వాత బ్రేక్ లేకుండా షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here