Harsha Vardhan : కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రిప్ట్ రైటర్ గా సినిమా ఇండస్ట్రీ లో పని చేస్తున్న హర్షవర్ధన్ చాలా మందికి మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలుసు. కానీ ఆయన మంచి స్క్రిప్ట్ రైటర్ అని చాలా మందికి తెలియదు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాకు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసారు. ఇక ‘మనం’ సినిమాకు కూడా కొన్ని డైలాగలను మార్పులు చేర్పులు చేసారు. ఇక చాలా సినిమాలకు స్క్రిప్ట్ అందించిన హర్షవర్ధన్ సినిమాల్లో ఎక్కువగా హాస్య ప్రధాన పాత్రలలో నటించారు.

స్క్రిప్ట్ రైటర్ లకు గౌరవం ఇవ్వరు…
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు ఉండటం వల్ల స్క్రిప్ట్ రైటర్ గా పెద్దగా డబ్బులు రాకపోయినా బాధపడనని చెప్పారు హర్షవర్ధన్. అయితే చాలా సినిమాలకు స్క్రిప్ట్ అందించినా తన పేరు వేసుకోకుండా చాలా మంది తన కథలను వాడారని కొన్ని సార్లు కథలను కాపీ కొట్టి మాది అని చెప్పుకుంటారని, ఇలాంటివి ఇండస్ట్రీ లో చాలా జరుగుతాయని చెప్పారు. అయితే నా కథలను పేరు వాడకుండా చాలా మంది తీసుకున్నా నాకేం పెద్ద బాధ అనిపించలేదు. నేను స్క్రిప్ట్ రైటర్ గా మాత్రమే ఉండాలని అనుకుని ఉంటే అది నష్టమే కానీ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను కాబట్టి ఇందులో డబ్బు వస్తుంది కనుక స్క్రిప్ట్ రైటర్ గా డబ్బులు రాకపోయినా పెదగా ఇబ్బంది లేదు అంటూ కామెంట్స్ చేశారు హర్షవర్ధన్.

రైటర్లకు సరైన గుర్తింపు గౌరవం ఇవ్వరంటూ మండిపడ్డాడు. సినిమా ఈవెంట్లలో కనీసం వారి పేరు కూడా చెప్పరు. పైగా ఏవైనా పంచ్ డైలాగ్స్ రాసి ఉంటే మాత్రం ఇక ఆ డైరెక్టర్ నేనే రాసాను అని తెగ చెప్పుకుంటారు, అలా ఎందుకు ఒక రైటర్ ని కించపరచాలి. ఇప్పుడిప్పుడే సినిమాలో హీరో ని మాత్రమే కాక డైరెక్టర్ ఇతర టెక్నీషియన్స్ని గుర్తిస్తున్నారు ఇది మంచి పరిణామంఅంటూ హర్ష అన్నారు. ఇక తన వద్దకు ఏదైనా స్క్రిప్ట్ వస్తే మూల కథ మారకుండా దాదాపు స్క్రిప్ట్ అంతా మార్చేస్తాను. నా కథలో డైరెక్టర్లు వేలు పెట్టి మార్చినా బాగుంటే ఒప్పుకుంటాను కానీ మూల కథ మారకుండా జాగ్రత్త పడుతాను అంటూ చెప్పారు హర్ష వర్ధన్.





























