ఒకానొక సందర్భంలో అవకాశాల కోసం పెద్ద డైరెక్టర్లను కూడా కలవడం జరిగింది. ఇప్పుడు టాప్‌లో ఉన్న దాదాపు అందరు దర్శకులను కలిశానని బుల్లితెర నటుడు శ్రీ కృష్ణ కౌశిక్ అన్నారు. అలా కలిసిన తర్వాత అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఆ సినిమాల్లో వేషం లేదన్నారని ఆయన వాపోయారు. దానికి తన ప్రయత్న లోపమా, లేదంటే ఇంకేదైనా కారణమా అన్నది తనకు నిజంగా అర్థం కాలేదని ఆయన అన్నారు. చిన్నప్పటి నుంచి తాను ఇండస్ట్రీలో ఉన్నానన్న కౌశిక్, తన పేరు తెలియక పోయినా తన ముఖం చూస్తే అందరూ గుర్తు పడతారని ఆయన చెప్పుకొచ్చారు. పెద్ద డైరెక్టర్లకు సైతం తన పేరేంటో తెలియకపోయినా చూస్తే మాత్రం పలకరిస్తారని ఆయన అన్నారు.

కానీ వాళ్లను ఎప్పుడు కలవాలన్నది మాత్రం తనకు అర్థం కావడం లేదని శ్రీ కృష్ణ కౌశిక్ తెలిపారు. మామూలుగా అయితే రేపు సినిమా ఓపెనింగ్ అంటే ఈ రోజు వెళ్లి కలుస్తారు. అది కామన్‌గా ఇండస్ట్రీలో జరిగేదే. అది తెలుగైనా, ఇంకో ఇండస్ట్రీ అయినా కూడా ఆఫీస్ ఓపెన్ చూసి పూజ చేసి, క్లాప్ కొట్టాక అప్పుడు వెళ్లి కలుస్తాం మాములుగా అయితే అని ఆయన చెప్పారు.
ఇకపోతే కొన్ని కొన్ని సినిమాల్లో అయితే బాగా చేస్తున్నావని వద్దన్నారని ఆయన తెలిపారు. అది తన బ్యాడ్ లక్కేనా అని అప్పుడు ఆయన అనుకున్నట్టు కౌశిక్ వివరించారు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను నటించిన కిట్టుగాడు సీరియల్‌ను ట్యూషన్ ఎగ్గొట్టి మరీ చూసేవారని ఆయనే తనకు చెప్పినట్టు కౌశిక్ అన్నారు. ఆయన్ని కలిసినపుడు కూడా మనం కలిసి చేద్దామని అన్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో, అసలు ఎక్కడ లోపం ఉంటుందో తనకు నిజంగా తెలియడం లేదని ఆయన చెప్పారు. తనకు నిజంగా చేసి నిరూపించుకుంటానన్న నమ్మకం ఉందన్న కౌశిక్, కానీ అవకాశాలు మాత్రం ఎందుకు రావట్లేదో తెలియడం లేదని ఆయన వివరించారు.


































