రాత్రి మిగిలిన అన్నం ఉదయం తినడం చాలా మందికి అలావాటు. అంతే కాకుండా వాటిని ఉదయం ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్లకు కూడా పెడతారు. ఫలితంగా వాళ్లకు ఫుడ్ పాయిజన్ కావడమో.. లేదా కడుపు నొప్పి రావడమో జరుగుతుంది. ఇలా మిగిలిన అన్నం ఉదయం తినడం అనేది ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆధారంగా ఇండిపెండెంట్ ఇచ్చిన నివేదికలో మిగిలిన అన్నం తినడం మీ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిపారు. అటువంటి పరిస్థితిలో మీరు మరుసటి రోజు మిగిలిపోయిన అన్నం తినడం మానుకోవాలి. అంతేకాదు ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ కూడా కావొచ్చు.
అయితే వాటిన మనం ఎలా ఉపయోగించాలి అంటే.. అన్నం వండిన 2 గంటల తర్వాత వాటిపై బ్యాక్టీరియా చేరుతుంది. అటువంటి సమయంలో ఆ అన్నం తినకపోవడమే మంచిది. అయితే ఆ అన్నాన్ని ఫ్రిజ్ లో పెట్టుకుంటే మాత్రం ఆహారం పాటు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే వాటిని కూడా ఒకరోజు తర్వాత తినకూడదు.
అంటే.. ఎక్కువ గంటలు నిల్వ ఉంచినా.. ఫ్రిజ్ లో ఉంచినా ప్రమాదకరమే. అన్నం కొన్ని గంటలు మాత్రమే ఫ్రిజ్‌లో తాజాగా ఉంటుంది. అలాగే అన్నం వేడి చేసిన తర్వాత తినాలనుకుంటే ఒక్కసారి మాత్రమే వేడి చేయండి. మళ్లీ మళ్లీ వేడి చేసిన అన్నం తినకూడదు. ఒకసారి వేడి చేసిన ఏ పదార్థం అయినా మళ్లీ మళ్లీ వేడి చేస్తే అందులో ఉండే పోషకాలు నశిస్తాయని నివేదికలో వెల్లడించారు.































