కరోనా మహమ్మారి ఎంతటి విలయతాండవాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే చాలామంది అంతకముందు ఎప్పుడూ లేనంతగా కరోనా మహమ్మారి కారణంగా ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే పోషకవిలువలు ఉన్న ఆహార పదర్థాలను తినాలి.
అయితే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇవి మన శరీరం సొంతంగా ఈ ఆమ్లాలను ఉత్పత్తి చేయలేదు. కాబట్టి వీటిని ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆమ్లాలు ఎక్కుగా.. ట్రౌట్, సార్డినెస్, సాల్మన్, మాకేరెల్, ట్యూనా,హెర్రింగ్, చేపలలతో పాటు.. అవిసె గింజలు, వాల్ నట్స్, చియా గింజలు, పిస్తా, నూనె గింజలను ఆహారంగా తరచూ తీసుకోవాలి. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరోనా ముప్పును తగ్గించడంతో పాటు మరణించే ప్రమాదం నుంచి రక్షిస్తుంది.
ఇవి ఎక్కువగా ఉన్న వారిలో కరోనా సోకినా మరణం శాతం అనేది ఒమేగా -3 స్థాయిలు తక్కువగా ఉన్న వారిలో పోలిస్తే చాలా తక్కువ అని ప్రోస్టాగ్లాండిన్స్, ల్యూకోట్రియెన్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం తెలిసింది. ఇవి మన ఆహారంలో ఉండే విధంగా చూసుకుంటే.. గుండె జబ్బులు కూడా రాకుండా చూసుకోవచ్చు.
గర్భిణులకు ఇది పోషకాహారమైనది. వారికి ఇది ఒక దివ్యౌషధం లాంటిది. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల లోపం వల్ల నాడీ క్షీణత వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో ప్రకారం.. ప్రతీ రోజు ఒమేగా 3 ప్యాటీ ఆమ్లాలు తినడం వల్ల నాడీ సంబంధించి వ్యాధులు దరి చేరవని తేల్చింది. పలు సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…