కరోనా వైరస్ ప్రపంచాన్ని గజ గాజా వణికిస్తోంది. చైనాలో ఎంతో మంది మృత్యువాత పడటానికి కారణమైన మహమ్మారి కరోనా వైరస్.. తాజాగా ఇండియా లో ప్రవేశించింది. ఇండియాలో రెండు కరోనా కేసులు నమోదుకావడంతో తీవ్ర కలకం రేగుతుంది. అందులోను ఒక కేసు తెలంగాణా హైదరాబాద్ లో నమోదవడం నగర వాసులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది.

హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు గురించి వివరిచారు తెలంగాణా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. ప్రస్తుతం అతడికి ఐసోలేటెడ్ వార్డులో చికిత్స అందిస్తున్నామని.. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు ఆరోగ్యమంత్రి. అయితే కరోనా వైరస్ గురించి ప్రజలు ఆందోళనలు చెందాల్సిన పనిలేదని.. మన వాతావరణ పరిస్థితుల్లో ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని స్పష్టం చేసారు. తుమ్ములు, దగ్గు, జ్వరం ఉంటె వెంటనే ఆసుపత్రికి వెళ్లి చూపించాలని… బహిరంగ ప్రదేశాలకు వెళ్లేప్పుడు మాస్క్ లు ధరించాలని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్.

హైదరాబాద్ కు చెందిన 24 ఏళ్ల టెకీ బెంగళూరు లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఫ్రిబ్రవరి 15న కంపెనీ పనిమీద దుబాయ్ వెళ్ళాడు. అక్కడ నాలుగైదు రోజులపాటు హాంకాంగ్ కు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేసాడు. ఆ తరువాత ఫిబ్రవరి 20న బెంగళూరుకు వచ్చాడు. ఫిబ్రవరి 22న అక్కడనుంచి బస్సులో హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే తీవ్ర జ్వరం రావడంతో ఫిబ్రవరి 27న సికింద్రాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరాడు. టెస్టుల అనంతరం అనుమానం రావడంతో గాంధీ ఆసుపత్రికి వెళ్ళమని సూచించారు అపోలో ఆసుపత్రి వైద్యులు.

తాజాగా ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలకు గాంధీ ఆసుపత్రిలో చేరాడు. ఈ సాంపిల్స్ పూణే వైరాలజీ ల్యాబ్స్ కు పంపిస్తే కోవిడ్ -19 సోకిందని నిర్థారించారు వైద్యులు. ఈ విషయాన్ని కేంద్రంతో పాటుగా సీఎం కేసీఆర్ కు వివరించామని తెలిపారు ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్.

































