Hema : తెలుగు ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా పలు సినిమాల్లో నటించిన హేమ, తెలుగులో హీరోయిన్ స్నేహితురాలిగా మొదలై ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలుగా మారింది. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా బాగా వైరల్ అయిన హేమ ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఆ మధ్య మా ఎన్నికల సమయంలో శివబాలాజీ తో గొడవ, కొరకడం వంటి విషయాలతో బాగా వైరల్ అయింది హేమ. అయితే ఎలక్షన్ సమయంలో ఎందుకంత గొడవ జరగాల్సి వచ్చిందో స్పందించింది.

చీ సిగ్గుందా మీకు… ఒక్కడ్ని కొడతారా…
ప్రకాష్ రాజ్, విష్ణు కి రసవత్తరంగా పోటీ జరిగి విష్ణు మా అసోసియేషన్ మెంబెర్ గా గెలిచాడు. అయితే ఎలక్షన్ సమయంలో సాధారణ ఎలక్షన్ లాగా గొడవలు, రాజకీయాలు జరిగాయి. ఇక ఓటింగ్ జరిగిన రోజు జరిగిన ఉదాంతాల గురించి హేమ ఫైర్ అయింది. విష్ణు ప్యానెల్ లో వాళ్ళు ఓటింగ్ సమయంలో కూడా ప్రాంప్లెట్స్ పంచుతూ తిరగొచ్చు, ఓవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ వాళ్ళు చేస్తే గొడవ చేస్తారు. ఓటింగ్ వేసే ప్రాంతంలో కూడా శివ బాలాజీ భార్య ఓటు ఎవరికి వేయాలో చూపిస్తోంది, ఓటు వేయడానికి వచ్చిన వాళ్లకు అది తప్పుగా అనిపించడం లేదు కానీ శివ బాలాజీ, నరేష్ కి బయట ప్రకాష్ రాజ్ కి సంబంధిచిన మనుషులు ప్రచారం చేస్తే తప్పైపోయింది. నరేష్ కి సంబందించిన బాడీ గార్డ్ లు ఆ ప్రచారం చేసే అబ్బాయిని కొట్టడానికి పోతే నేను అడ్డుకోడానికి వెళ్ళబోయాను శివ బాలాజీ చేయి అడ్డం పెట్టి ఆపాడు.

దీంతో నేను తప్పించుకోడానికి కరిచాను, కానీ నేను చేయి పైన కరిస్తే, చేయి పై వేరే చోట కరిచినట్లు చూపిస్తున్నాడు, కట్టు కట్టించి ఇంజక్షన్ వేయించి హాస్పిటల్ వెళ్లి తెగ హడావిడి చేసారు. ఇక విష్ణు ప్యానెల్ లో వాళ్ళు మాట్లాడిన బూతులకు చాలా సార్లు ప్రకాష్ రాజు గారు ఏడ్చారు. కానీ గొడవలు వద్దు అని అయన గాంధీ మార్గంలోనే వెళ్లారు. నేను చేయి కరిచినపుడు కూడా వెళ్లి వివరిస్తాను మీడియాకు అని చెప్పినా వద్దు గొడవలు వద్దు అంటూ అయన చెప్పారు. ఇపుడు మా అసోసియేషన్ వైపు వెళ్లడం లేదు, మేము చేయనియ్యం పనులు అంటూ మళ్ళీ గొడవలు ఎందుకు, అందుకే అసలు వెళ్లడం లేదు, వాళ్ళే చేసుకోని అని వదిలేసాము అంటూ చెప్పారు హేమ.






























