Hemachandra and Sravana Bhargavi : హేమచంద్ర, శ్రావణ భార్గవి సింగర్లుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేర్లు. సింగర్లగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్తులగా కూడా తమని తాము నిరూపించుకున్నారు. రైడ్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే కొన్నేళ్లు కొనసాగిన వీరి ప్రేమ 2013 లో పెళ్లితో ఇద్దరూ ఒక్కటి అయ్యారు. వీరిద్దరి ప్రేమ బంధానికి గుర్తుగా ఒక పాప కూడా వుంది. పాప పేరు శిఖర చంద్రిక. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి వివాహ బంధం గురించి ఒక వార్త అభిమానులను కలవరపెడుతోంది. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని ప్రచారం జరుగుతోంది.

కలవరపెడుతున్న హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల వార్త…
పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ తమ కెరీర్ను ఫుల్ జోష్తో కొనసాగిస్తున్నారు. పెళ్లి తరువాత ఇద్దరూ కలసి బోల్ బేబీ బోల్ అనే సింగింగ్ ప్రోగ్రాంకు యాంకర్ లుగా వ్యవహారించారు. ఆ తరువాత మా టీవీ లో ప్రసారం అయిన సై సింగర్స్ ఛాలెంజ్ కూడా చేశారు. వీటితో పాటు రేడియో షోలు చేశారు. ఇక తాజాగా నెల రోజుల క్రితం ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షోకు హేమచంద్ర, శ్రావణ భార్గవి గెస్టులుగా వచ్చి అందర్ని అలరించారు.

ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఓ వార్త మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా విడిగా వుంటున్నారని, అంతే కాకుండా ఇద్దరూ విడాకులు తీసుకొనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇన్నేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత వుందో తెలియాలి అంటే ఇద్దరిలో ఒకరైనా స్పందించాలి. ఇకపైన హేమచంద్ర, శ్రావణ భార్గవిలు విడాకులపై స్పందిస్తారేమో వేచి చూడాలి.

































