Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో సరికొత్త టాస్కుల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎదుట ఎంటర్టైన్ చేసిందని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఇక 12 వారాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం 13వ వారంలోకి అడుగు పెట్టింది. ఇక 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా చాలా రచ్చ రచ్చగా కొనసాగిందని తెలుస్తోంది.

ఇక ఇందులో ఎవరైతే ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారికి రంగులు పూసి నామినేట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను తెలపాలని బిగ్ బాస్ చూచించారు అయితే ఈసారి మాత్రం శివాజీని హౌస్ మెట్ లో టార్గెట్ చేశారని తెలుస్తోంది. సీరియల్ బ్యాచ్ మొత్తం శివాజీని టార్గెట్ చేయడంతో యావర్ ప్రశాంత్ ప్రియాంక శోభ శెట్టిలను టార్గెట్ చేశారు.
ఇక ఈ వారం అమర్ దీప్ మినహా మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక ఈ నామినేషన్స్ లో భాగంగా కంటెస్టెంట్ ల మధ్య గొడవలు కూడా జరిగాయి ముఖ్యంగా గౌతమ్ శివాజీ మధ్య పెద్ద గొడవే జరిగిందని చెప్పాలి గౌతమ్ శివాజీని నామినేట్ చేస్తూ.. శివాజీ అన్నతో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన మొదటి నుంచి తనకు కంఫర్టబుల్ గా ఉన్న వారికి సపోర్ట్ చేస్తున్న వచ్చారు నాకు అడ్డుపడుతున్నారు అంటూ శివాజీని నామినేట్ చేయగా శివాజీ కూడా అందుకు దీటుగానే సమాధానం ఇచ్చారు.
స్టెరాయిడ్స్….
ఇక యావరు గౌతమ్ ని నామినేట్ చేశారు. నువ్వు నేను స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాను అని మాట్లాడావు అంటూ గౌతమ్ ని నామినేట్ చేశారు. ఇంతలో శివాజీ గురించి చర్చ రావడంతో గౌతమ్ రెచ్చిపోయారు మీరు నా తల తీసిన కూడా నేను శివాజీ గురించి ఇలాగే మాట్లాడతాను అంటూ గౌతమ్ చెప్పారు. ఇక శివాజీని సీరియల్ బ్యాచ్ మొత్తం టార్గెట్ చేయడంతో ప్రిన్స్ యావర్ కూడా గౌతమ్ అర్జున్ తో పాటు ప్రియాంక శోభా శెట్టిని కూడా నామినేట్ చేశారు.





























