లాక్ డౌన్ సమయంలో పెళ్లిపీటలెక్కింది మరో హీరోయిన్. మొన్ననే హీరోయిన్ ప్రణీత సైలెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఈలోపే మరో హీరోయిన్ యామీ గౌతమ్ వివాహం చేసుకుంది. హీరోయిన్ యామి గౌతం బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యను పెళ్లి చేసుకుని, ఏడడుగులు నడిచింది. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నేడు(శుక్రవారం) వీరిద్దరి పెళ్లి జరిగింది.
ఈ విషయాన్ని యామీ గౌతమ్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యండిల్స్ ద్వారా అభిమానులతో పంచుకుంది. మేము పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టామంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. అయితే, పెళ్లికొడుకు ఆదిత్య మరెవరో కాదు, ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ డైరెక్టర్.. ప్రస్తుతం ఇతడు విక్కీ కౌశల్ హీరోగా ‘ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ సినిమా తీస్తున్నాడు. ఇక యామి గౌతమ్ తెలుగులో నితిన్ సరసన ‘కొరియర్ బాయ్ కల్యాణ్’లో నటించింది. అంతకంటే ముందు మరో మూడు సినిమాలు నువ్విలా, గౌరవం, యుద్ధం వంటి చిత్రాల్లో కనిపించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…