Hero Ashwin Babu : సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ అయ్యాక… ఆ మాటలకు చాలా కోపం వచ్చింది…: హీరో అశ్విన్ బాబు

0
123

Hero Ashwin Babu : ఓంకార్ బుల్లితెర అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన షోస్ తో కంటే కూడా ఆ షోస్ లో ఉండే ఎమోషన్స్, గొడవలతోనే బాగా ఫేమస్. ఆట, మాయాద్వీపం, జీనియస్, తాజాగా సిక్స్త్ సెన్స్ ఇలా ప్రోగ్రాం ఏదైనా హైప్ మాత్రం ఓంకార్ షోలో ఎక్కువుటుంది. ఇక ఓంకార్ గారు మొదట జెమినీ మ్యూజిక్ లో యాంకర్ గా పనిచేసేవారు. ఆపైన షోస్ చేస్తూ పేరు తెచ్చుకున్నారు. ఇక తమ్ముడు అశ్విన్ బాబును హీరోగా పెట్టి సినిమాలను కూడా తీశారు. ‘రాజు గారి గది’ సినిమా హిట్ కూడా అయింది. ఆపైన వచ్చిన రాజు గారి గది 2 లో నాగార్జున సమంత వంటి బిగ్ స్టార్స్ కూడా ఉన్నారు. ఇక తాజాగా ‘హిడింబ’ అనే సినిమాతో అశ్విన్ బాబు వస్తుండగా ఇంటర్వ్యూలో తనకు మంచి ఫ్రెండ్ అయిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడారు.

సాయి కి ఆక్సిడెంట్ అయ్యాక ఆ మాటలకు బాధేసింది…

సాయి ధరమ్ తేజ్ కు బైక్ ఆక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ముందు చిన్నదే అనుకున్నా తర్వాత అది ఎంత పెద్ద ప్రమాదం అనేది అందరికీ అర్థమైంది. ఆ ప్రమాదం తర్వాత దాదాపు 45 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న సాయి ధరమ్ తేజ్ మళ్ళీ హీరోగా మన ముందుకు వస్తాడా అని అందరూ అనుకున్నా చివరకు మళ్ళీ హీరోగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆక్సిడెంట్ సమయంలో కొన్ని మీడియా ఛానెల్స్ మద్యం తాగి నడపడం వల్ల ఆక్సిడెంట్ అయింది అంటూ మాట్లాడటం చాలా బాధనిపించింది అంటూ హీరో అశ్విన్ అభిప్రాయపడ్డారు. అలా వార్తలు రాసిన వారి మీద చాలా కోపం వచ్చింది అంటూ చెప్పారు. ఆక్సిడెంట్ తరువాత మళ్ళీ కోలుకుని విరూపాక్ష లాంటి మంచి సినిమా చేసాడు. ఇప్పుడు కూడా ఒకసారి మాట్లాడినపుడు మీడియాతో ఇలా మాట్లాడుతుంటే తాగి మాట్లాడుతున్నానని అనుకోకండి అంటూ చెప్పాడు, అపుడు చాలా బాధనిపించింది అంటూ చెప్పాడు.