Hero J.D. Chakravarthy : శివ సినిమాతో తెలుగులో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులకు గుర్తిస్తారు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జేడి చక్రవర్తి శివ, సత్య, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ, అటు తమిళం, కన్నడ, మాలయం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా యోట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

జయసుధ అంటే చాలా ఇష్టం…
తాజాగా ఒక యూతబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడి చక్రవర్తి మాట్లాడుతూ తాను లైఫ్ లోని కొన్ని ఆసక్తికర సంఘటనలను తెలిపారు. తనకు రామ్ గోపాల్ వర్మకు జయసుధ అంటే చాలా ఇష్టమని జయసుధ ను సుధ డార్లింగ్ అంటూ పిలుస్తానని చెప్పారు. తనతో కలిసి మనీ సినిమా చేసే సమయంలో ఒకసారి ఆమె భర్త నితిన్ రాగా అతడినే డైరెక్ట్ గా నేను జయసుధ ను పెళ్లిచేసుకుంటా అని చెప్పాను. నేను సరదాగా అన్నాను అని అతనికి తెలుసు కానీ అతని సెన్స్ అఫ్ హుమర్ కి బాగా అనిపించింది. వెంటనే ఆయన ఒక డేట్ చెప్పి ఆరోజు చేసుకో అన్నారు. ఎందుకు అంటే అది మా పెళ్లి రోజు ఆరోజైతే మొగుడు మారుతాడు కానీ పెళ్లి రోజు మారదు కదా అంటూ నవ్వారు. అలా నా స్నేహితులు వాళ్లకు నేను ఏ ఉద్దేశంతో మాట్లాడుతానో తెలుసు అందుకే నవ్వుకుంటాం. తెలియని వాళ్ళే వీడేంటి ఇలా మాట్లాడుతాడు అనుకుంటారు అంటూ చెప్పారు. ఇక రాఘవేంద్ర రావు గారితో జరిగిన సంఘటన గురించి చెబుతూ బొంబాయి ప్రియుడు సినిమాలో షూటింగ్ కోసం మారిషస్ వెళ్ళగా అక్కడ సడెన్ గా మా అమ్మకు బాగోలేకుండా అయింది.

అక్కడ జాయిన్ చేసిన వాళ్ళే డిశ్చార్జ్ చేయించాలని కండిషన్స్ ఉంటాయి. దీంతో ఇబ్బందిపడ్డాను, అదే సమయంలో వెళ్ళడానికి కార్ డ్రైవర్ కూడా బిజీగా ఉండటంతో ఒక్కసారిగా డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారి మీద అరిచేసాను. ఆయనను ఫ** అంటూ బూతు మాట తిట్టినా ఆయన మళ్ళీ వేరే వాళ్ళతో నేను గే కాదు అలాగే ఈ వయసులో అతడిని ఏమి చేయలేను అని చెప్పు అంటూ పంపారు. నాకు ఆయన సంస్కారం చూసి ఆశ్చర్యం వేసింది. రాఘవేంద్ర రావు గారిని నేను రాగూ అని పిలుస్తాను గారు అంటూ పిలిస్తే తనకు నచ్చదు అంటూ చెప్పారు.






























