Hero Jagapathi Babu : కుటుంబ కథా చిత్రాల హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు అప్పట్లో శోభన్ బాబు గా పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరు హీరోయిన్లు, లేదా మొగుడు పెళ్ళాల కాన్సెప్ట్ తో సినిమా ఇలా మహిళా ప్రేక్షకులను ఎక్కువ సొంతం చేసుకున్న జగపతి బాబు ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోల్లా కాదు ముక్కుసూటిగా ఉన్నది మాట్లాడేస్తాడు. తన గురించైనా సరే లోపాలను చెప్తాడు. ఇక ఒకరిని పొగుడుతూ ఉండటం భజన చేయడం రాడు కాబట్టే ఇండస్ట్రీలో పెద్దగా నన్ను ఎవరూ పట్టించుకోలేదు అంటూ చెప్పే జగపతి బాబు తనకు ఉమెన్ అంటే ఇష్టం కానీ విమెనైజర్ కాదుఅంటూ ఘాటుగా చెప్పేస్తాడు. 60 ఏట అడుగుపెట్టిన జగపతి బాబు గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫ్యామిలీ గురించి అలాగే సినిమాల గురించి మాట్లాడారు.

డబ్బెక్కువై ఊపిరి ఆడటం లేదు…
జగపతి బాబు గారు మిగతా హీరోల్లా కాకుండా డబ్బు సంపాదన మీద పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆయన అనుకుని ఉంటే ఇప్పటికి వందల కోట్లు ఆస్తులు సంపాదించి ఉండవచ్చు కాని ఆయన అలా చేయలేదు. కేవలం తనకూ తన కుటుంబానికి ఎంత అవసరమో అంతే సంపాదించారు. అందులో తృప్తి ఉంటుందంటూ చెప్తారు జగపతి బాబు. దేనికైనా ఫుల్స్టాప్ పెట్టకపోతే జీవితంలో తృప్తి ఉండదని చెప్పారు. అక్కడికి ఆపేసి సంతృప్తి చెందితే సంతోషం ఉంటుందని, అలా కాకుండా ఎప్పుడూ డబ్బు డబ్బు అంటూ ఊపిరి కూడా బిగబట్టి చస్తున్నారు.

కరోనా కి ముందు నాకు తెలిసిన ఒకడు విజయవాడ కొనగలను, ఆంధ్రప్రదేశ్ కొంగలను అంటూ చెప్పేవాడు. కరోనా టైములో ఆక్సిజన్ కొనలేక చచ్చాడు. నాది నాది అంటూ ఎంత సంపాదించినా నేను ఊపిరి పీల్చుకున్నది కూడా నాదే అనుకుని అలాగే బిగపెట్టుకుంటే చచ్చిపోతాము. అలాంటిది ఇది నా డబ్బు నాది అంటూ ఎందుకు బ్రతకాలి. జీవితంలో డబ్బు కాదు ముఖ్యమైనది సంతృప్తి, అది ఉంటే సంతోషంగా ఉంటాం. ఈ విషయం నేను గ్రహించాను అందుకే డబ్బు సంపాదన గురించి పెద్దగా ఆలోచించను అంటూ చెప్పారు జగపతి బాబు.



























