Hero Jagapathi Babu : కుటుంబం కథా చిత్రాల హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు అప్పట్లో శోభన్ బాబు గా పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరు హీరోయిన్లు, లేదా మొగుడు పెళ్ళాల కాన్సెప్ట్ తో సినిమా ఇలా మహిళా ప్రేక్షకులను ఎక్కువ సొంతం చేసుకున్న జగపతి బాబుకి ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోల్లా కాదు ముక్కుసూటిగా ఉన్నది మాట్లాడేస్తాడు. ఇక ఒకరిని పొగుడుతూ ఉండటం, భజన చేయడం రాడు కాబట్టే ఇండస్ట్రీలో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు అంటూ చెప్పే జగపతి బాబు తనకకు ఉమెన్ అంటే ఇష్టం కానీ విమెనైజర్ కాదు అంటూ ఘాటుగా చెప్పేస్తాడు. 60 ఏట అడుగుపెట్టిన జగపతి బాబు గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫ్యామిలీ గురించి అలాగే సినిమాల గురించి మాట్లాడారు.

రాజమౌళి సినిమాలో చేయకపోడానికి కారణం…
జగపతి బాబు గారు హీరో అనేకంటే మంచి ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. ఆయనకు క్యారెక్టర్ నచ్చితే అది హీరోనా లేక సహాయక పాత్ర అని చూడరు, చేస్తారు. ఇమేజ్ చట్రంలో లేకుండా సినిమాలలో నటించే ఆయన అగ్ర దర్శకుల సినిమాల్లో సినిమాలను చేస్తున్నా ఇప్పటికీ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయలేదు. నిజానికి రాజమౌళి కొడుకుకి జగపతి బాబు అన్న కూతురికి పెళ్లి కూడా జరిగింది. అలా చూసుకున్నా వీళ్లిద్దరూ బంధువులే అయినా ఇప్పటివరకు రాజమౌళి సినిమాలో జగపతి నటించలేదు. అయితే ఈ విషయం గురించి జగపతిని అడిగినపుడు ఆ విషయం రాజమౌళి ని అడగాలి అంటూ చెప్పారు. ఇక తాను మాత్రం అవకాశం కోసం అడగనని ఒకవేళ అడిగితే ఆయన ఒకే చెప్పినా నాకు అది నచ్చదు, నేను అడిగాను కాబట్టి ఇచ్చారు అనిపిస్తుంది.

ఆయనకు స్వతహాగా ఆ పాత్రకు జగపతి బాగుంటాడు అనిపిస్తే ఇస్తే అది నాకు గౌరవం అంటూ చెప్పారు. ఇక తన ఇంట్లో సినిమా గురించి చర్చ ఉండదని, పిల్లలు పెద్దగా సినిమాలను చూడరు అంటూ చెప్పారు. పెద్దమ్మాయికి చిన్నతనంలో షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం ఉండేదని తనకు ఇష్టం కదా అని ఒకసారి కాల్ చేసి మాట్లాడించాలనుకుంటే భయపడి బాత్రూంలో దక్కుందంటూ చెప్పారు. ఇక చిన్నమ్మాయికి రామ్ చరణ్ అంటే ఇష్టం దీంతో ఒకసారి తన బర్త్ డే నాడు రామ్ చరణ్ తో ఫోన్ లో విష్ చేయిద్దామంటే తాను ఇబ్బంది పడింది. నాకు ఇష్టం అంతే ఇలా అంత చేయొద్దు నాన్న అని చెప్పింది అంటూ తన ఫ్యామిలీ గురించి పంచుకున్నారు.































