Hero Nani: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన టాలెంట్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని.అష్టా చమ్మా సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నాని పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.కొద్దిరోజుల క్రితం అంటే సుందరానికి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని తన తదుపరి చిత్రం దసరా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమా బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయడం కోసం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా నాని ఏకంగా బొగ్గు లారీ కింద ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది.
అదృష్టవశాత్తు నానికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా బయటపడటంతో ఒకసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుత ఈ సినిమా తెలంగాణలోని గోదావరిఖని బొగ్గు గనులలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా నాని బొగ్గు లారీ కింద నిలబడి ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉండగా అనుకోకుండా లారీలో ఉన్న బొగ్గు మొత్తం తనపై పడినట్లు తెలుస్తోంది.

Hero Nani: ఊపిరి పీల్చుకున్న అభిమానులు…
ఇలా ఈ ప్రమాదం జరగడంతో అందరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు.అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో నానికి ఏ విధమైనటువంటి గాయాలు కాలేదు. అయితే ఆయన ఈ ప్రమాదానికి గురి కావడంతో కాసేపు షూటింగ్ నిలిపివేశారు. అనంతరం నాని తిరిగి రెడీ అయ్యి వచ్చిన తర్వాత యధావిధిగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం జరుపుకున్నారు.ఈ విషయం తెలిసిన నాని అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందినప్పటికీ నానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.






























