Hero Navadeep : ‘జై’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవదీప్ ‘గౌతమ్ ఎస్ ఎస్ సి’ సినిమాతో పర్వాలేదనిపించినా హీరోగా నిలబడలేదు. తర్వాత వచ్చిన ‘చందమామ’లో నటనకు ప్రశంసలు అందుకున్నా అవకాశాలు మంచి విజయాలు రాలేదు. తిరిగి బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 ద్వారా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చి తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో అతని వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు లో వైల్డ్ కార్డు ఎంట్రీల్లో ది బెస్ట్ అని చెప్పవచ్చు, అంతలా ప్రేక్షకులను అలరించాడు.

నాగార్జునని చూసి వాత పెట్టుకున్నాను…
నవదీప్ హీరోగా కలిసిరాకపోవడంతో అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే విలన్ గాను విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడు. అయితే నవదీప్ సినిమాలే కాకుండా బయట బిజినెస్ కూడా చేస్తున్నాడు. పబ్ నడుపుతూ బాగానే సంపాదిస్తున్నాడు. అయితే తాను సినిమాలతో పాటు బిజినెస్ చేయడానికి కారణం హీరో అక్కినేని నాగార్జున అంటూ చెప్పారు.

నాగార్జున గారు అయన ఎంత క్లాస్ గా ఉంటారో అంతే క్లాస్ గా ఆయన బిజినెస్ లు కూడా ఉంటాయి అనిపించింది, నేను బిజినెస్ లోకి దిగి వాతలు పెట్టుకున్నాను అంటూ చెప్పారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు నేను నాగార్జున గారిని చూసి బిజినెస్ చేసేద్దాం అనుకుని దెబ్బ తిన్నాను అంటూ చెప్పారు నవదీప్.
































