బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబుగా గుర్తింపును సంపాదించుకున్న నిరుపమ్ ప్రస్తుతం కార్తీకదీపం హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. ఇక కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే నిరుపమ్ ఎక్కడికి వెళ్లిన ఈ సీరియల్ ప్రస్తావన తీసుకు వచ్చారని తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ 1069 ఎపిసోడ్ జరుగుతూ అనేక ట్విస్ట్ లను ఇస్తున్నారు. ఇన్నిరోజులు అందరూ ఎంతో ఉత్కంఠగా డాక్టర్ బాబు, వంటలక్క ఎప్పుడు కలుస్తారు అని ఎదురు చూశారు. ఇక ఇద్దరు కలుసుకొనే సమయానికి మౌనిత కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని ట్విస్ట్ ఇవ్వడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఈ క్రమంలోనే చాలా మంది అభిమానులు ఈ సీరియల్ కి ముగింపు లేదా? డాక్టర్ బాబు వంటలక్క ఇప్పుడే కలవరా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా డాక్టర్ బాబు దీప కార్తీక్ ఎప్పుడు కలుస్తారు? అంటూ తనకు మెసేజ్ లు చేయడం, దీపను బాధ పెడుతున్నందుకు తనని డైరెక్టుగా తిట్టడం వంటివి కూడా చేస్తున్నారని ఇంటర్వ్యూలో డాక్టర్ బాబు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా మీమ్స్ ట్రోల్స్ చూసి వీళ్లేంట్రా బాబూ నాపై పడ్డారు అనుకుంటా. చాలా వాటికి నవ్వుకుంటా.. తిట్టునప్పుడు మాత్రం ఫీల్ అవుతుంటా అని తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాబు మాట్లాడుతూ కార్తీకదీపం, హిట్లర్ గారి పెళ్ళాం వంటి రెండు విభిన్న కథలు ఒకేసారి నాకు దొరకడం ఎంతో అదృష్టం. కార్తీకదీపం సీరియల్ ఎప్పుడు ఎటు వెళ్తుందో నాకు కూడా తెలియదు.కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఆడియన్స్ ఎంత ఉత్కంఠగా ఎదురు చూశారో, నేను బయటకు ఎక్కడికి వెళ్లిన చాలామంది మీరు, వంటలక్క ఎప్పుడు కలుస్తున్నారని అడుగుతారు.నేను కూడా ఆ సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా డాక్టర్ బాబు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…