నన్ను దారుణంగా తిడుతున్నారు.. కార్తీకదీపం నిరుపమ్ పరిటాల!

0
874

బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబుగా గుర్తింపును సంపాదించుకున్న నిరుపమ్ ప్రస్తుతం కార్తీకదీపం హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. ఇక కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే నిరుపమ్ ఎక్కడికి వెళ్లిన ఈ సీరియల్ ప్రస్తావన తీసుకు వచ్చారని తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ 1069 ఎపిసోడ్ జరుగుతూ అనేక ట్విస్ట్ లను ఇస్తున్నారు. ఇన్నిరోజులు అందరూ ఎంతో ఉత్కంఠగా డాక్టర్ బాబు, వంటలక్క ఎప్పుడు కలుస్తారు అని ఎదురు చూశారు. ఇక ఇద్దరు కలుసుకొనే సమయానికి మౌనిత కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని ట్విస్ట్ ఇవ్వడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఈ క్రమంలోనే చాలా మంది అభిమానులు ఈ సీరియల్ కి ముగింపు లేదా? డాక్టర్ బాబు వంటలక్క ఇప్పుడే కలవరా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా డాక్టర్ బాబు దీప కార్తీక్ ఎప్పుడు కలుస్తారు? అంటూ తనకు మెసేజ్ లు చేయడం, దీపను బాధ పెడుతున్నందుకు తనని డైరెక్టుగా తిట్టడం వంటివి కూడా చేస్తున్నారని ఇంటర్వ్యూలో డాక్టర్ బాబు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా మీమ్స్ ట్రోల్స్ చూసి వీళ్లేంట్రా బాబూ నాపై పడ్డారు అనుకుంటా. చాలా వాటికి నవ్వుకుంటా.. తిట్టునప్పుడు మాత్రం ఫీల్ అవుతుంటా అని తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాబు మాట్లాడుతూ కార్తీకదీపం, హిట్లర్ గారి పెళ్ళాం వంటి రెండు విభిన్న కథలు ఒకేసారి నాకు దొరకడం ఎంతో అదృష్టం. కార్తీకదీపం సీరియల్ ఎప్పుడు ఎటు వెళ్తుందో నాకు కూడా తెలియదు.కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఆడియన్స్ ఎంత ఉత్కంఠగా ఎదురు చూశారో, నేను బయటకు ఎక్కడికి వెళ్లిన చాలామంది మీరు, వంటలక్క ఎప్పుడు కలుస్తున్నారని అడుగుతారు.నేను కూడా ఆ సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా డాక్టర్ బాబు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here