Heroine Ester Noronha : ‘వెయ్యి అపద్ధాలు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎస్తేర్ ఆ తరువాత ‘భీమవరం బుల్లోడు’ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఎస్తేర్ సినిమాలు చేస్తూనే రాపర్, సింగర్ నోయెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే మొదట్లో బాగానే ఉన్నా వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. విడిపోయాక ఎస్తేర్ మళ్ళీ సినీమాల్లో బిజీగా ఉంది. ఇక తన సినిమా విశేషాలను గురించి వివరించారు.

విడిపోయాక చెప్పింది ఇదే…
సింగర్ మరియు రాపర్ అయిన నోయల్, హీరోయిన్ ఎస్తేర్ ను వివాహం చేసుకున్నారు. మొదట్లో బాగానే ఉన్నా వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. అయితే వీళ్ళు విడిపోయిన తరువాత ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా సోషల్ మీడియా మాత్రం వీళ్ళను వదలడం లేదు. వారు విడిపోవడానికి కారణాలు, ఇక రెండో పెళ్లి గురించి రక రకాల ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ విడాకులు అలానే ఆ విషయానికి సంబంధించిన ప్రశ్నలే ఎస్తేర్ కి ఎదురయ్యాయి.

డివోర్స్ తీసుకున్నాక నోయెల్ కి చివరగా పెట్టిన మెసేజ్ ఏమిటి అనే ప్రశ్న ఎదురవగా ఎస్తేర్ అలా డ్రమటిక్ విషయాలేమీ జరగలేదని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాక తన ఇంటి నుండి వచ్చేటప్పుడే నీకు నచ్చిన అమ్మాయి నీ అభిప్రాయాలతో కలిసే అమ్మాయి నీ జీవితంలోకి రావాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి వచ్చేశానంటూ ఎస్తేర్ చెప్పారు. ప్రపంచంలో ఎవరైనా ప్రేమ పొందడానికి అర్హులే. అందులో తప్పేమి లేదు. తన స్వభావానికి సరిపోయే అమ్మాయి దొరికి తనకు ప్రేమ లభిస్తే మంచిదే కదా అంటూ ఇంటర్వ్యూలో తెలిపారు.