Heroin Real Names : సినిమా ఇండస్ట్రీలో అదృష్టం కలిసి వస్తుందని కొంత మంది పేర్లు మార్చుకోవడం మామూలే. ఇక హీరోయిన్లు ఇలాంటి వారిలో ముందుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ఇలా తేడా లేకుండా పేర్లు మార్చుకొని వారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే కొంత మంది అసలు పేర్లు చాలా మందికి ఇప్పటికీ తెలియవు. వారి స్క్రీన్ పేర్లతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న కొంతమంది ఇలా పేర్లు మార్చుకొని అలరిస్తున్నారు.

పేర్లు మార్చుకున్న హీరోయిన్లు…
టాలీవుడ్ లో కొన్ని చిత్రాలలో నటించి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కత్రినా కైఫ్ అసలు పేరు కత్రినా టర్కొట్టే. ఇక సన్నీ లియోన్ అసలు పేరు కరణ్ జీత్ కౌర్ వోహ్ర. సన్నీ లియోన్ అసలు పేరు చాలా మందికి తెలిసిండక పోవచ్చు. మరో బాలీవుడ్ భామ మల్లికా శెరావత్ అసలు పేరు రీమా లంబా. యోగ బ్యూటీ శిల్పా శెట్టి అసలు పేరు కూడా అది కాదు, శిల్పా శెట్టి అసలు పేరు అశ్విని శెట్టి. పేరు మార్చుకున్న లిస్ట్ లో ఉన్న మరో హీరోయిన్ కియారా అడ్వాని. ఈమె అసలు పేరు అలియా అడ్వాని.

తెలుగులో వెంకటేష్ సరసన నటించిన బాలీవుడ్ భామ ప్రీతి జింటా అసలు పేరు ప్రీతమ్ జింటా సింగ్. ఈ లిస్ట్ లో ఉన్న మరో బ్యూటీ టబు. టబు అసలు పేరు కూడా ఇది కాదు. రీల్ నేమ్ తో పాపులరిటీ తెచ్చుకున్న టబు అసలు పేరు టబుస్సుమ్ హష్మీ. ఇక మన సౌత్ లేడీ సూపర్ స్టార్ నాయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్. ఇక మన జేజమ్మ పేరుకూడా అనుష్క కాదు స్వీటీ శెట్టి. తెలుగులో టాప్ హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకున్న స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు. ఇలా చాలా మంది హీరోయిన్లు అదృష్టమో మరి ఇతర కారణమో తెలియదు కానీ పేర్లు మార్చుకొని ఇండస్ట్రీలో స్టార్లుగా రాణిస్తున్నారు.


































