Heroine Amani : సహజమైన తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని సగటు ఇల్లాలి పాత్రలలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ, అటు బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఎమ్సీఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జిగా వ్యవహారిస్తూ సీరియల్స్ కూడా నటిస్తూ అలరిస్తున్న ఆమని తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

చిరంజీవి అంటే చిన్నప్పటి నుండి ఇష్టం…
సినిమాల్లో నటిస్తే హీరోయిన్ గానే నటించాలి అని ఇండస్ట్రీకి వచ్చిన ఆమని మొదట్లో బాగా ఇబ్బందులు పడినా చివరకు సినిమాల్లో హీరోయిన్ గానే తన కెరీర్ మొదలు పెట్టింది. అలా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పించిన ఆమనికి మెగాస్టార్ చిరంజీవి గారంటే చాలా ఇష్టమట. తన డ్రీమ్ హీరో చిరునే అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన ఆమని ఆయనతో కలిసి నటించే అవకాశం రిక్షావోడు సినిమాలో మిస్ అయినందుకు చాలా బాధపడిందట.

ఇక మరోసారి స్టాలిన్ సినిమాలో చిరంజీవి అక్కగా నటించే అవకాశం వస్తే ఆమని చేయలేదట. చేస్తే చిరు పక్కన హీరోయిన్ గానే చేయాలని డిసైడ్ అయిన ఆమని అక్కగా చేయనని చెప్పారట. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా ఏజ్డ్ చిరు క్యారెక్టర్ కి భార్య పాత్ర అయినా సరే చేస్తానని చెప్తోంది. ఏది ఏమైనా చిరు పక్కన హీరోయిన్ గా లేదా భార్యగానే నటిస్తాను అంటూ క్లారిటీ ఇస్తోంది.































