Heroine Ankitha : చాలారోజులకు మళ్ళీ కనిపించిన సింహాద్రి హీరోయిన్… భర్త, పిల్లలు ఏం చేస్తున్నారంటే… నవదీప్ తో జరిగిన గొడవ… ఆర్తి అగర్వాల్ ఎలా చనిపోయింది..!

0
289

Heroine Ankitha : రస్నా బేబీ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంకిత చిన్న వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఆపైన తెలుగులో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో నటించి ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో వరుస ఆఫర్స్ అందుకుంది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘సింహాద్రి’లో గ్లామర్ పాత్రలో నటించి మంచి హిట్ ఎందుకుని అటు తమిళం ఇటు తెలుగులో మంచి ఆఫర్స్ అందుకుంది. అయితే ఆపైన వరుస ఫ్లాప్స్ అందుకోవడంతో అంకిత కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. విజయేంద్ర వర్మ, మనసు మాట వినదు వంటి సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది అంకిత. తాజాగా అమెరికాలో స్థిరపడిన అంకిత ఒక ఇంటర్వ్యూలో కనిపించింది.

భర్త, పిల్లలు ఏం చేస్తారంటే…

అంకిత 2015 లో అమెరికా లో స్థిరపడిన ముంబై వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. భర్త సిటీ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తుండగా అంకిత ప్రస్తుతం పిల్లలను చూసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తనది ప్రేమ వివాహం అని మొదట తానే ప్రపోజ్ చేయగా ఈ ప్రేమ డేటింగ్ వద్దు పెళ్లి చేసుకుందామని తన భర్త చెప్పడంతో పెళ్లి చేసుకున్నారట.

నవదీప్ తో గొడవ, ఆర్తి అగర్వాల్, ఉదయ్ కిరణ్ బెస్ట్ ఫ్రెండ్స్…

ఇక సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ మనసు మాట వినదు సినిమాలో నటించేటపుడు నవదీప్ తో జరిగిన గొడవ గురించి చెబుతూ అది చాలా చిన్న గొడవ, ఇద్దరూ వేరే వేరే సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఒత్తిడికి లోనవ్వడం సహజమే అలా గొడవ జరిగింది ఆ తరువాత సద్ధుమణిగింది అంటూ చెప్పారు. ఇక తనకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అంటే ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ అంటూ చెప్పారు. ఉదయ్ కిరణ్ తో ఒక సినిమా మొదలయి మధ్యలోనే ఆగిపోయింది. కానీ మేము మంచి స్నేహితులం అయ్యాం అంటూ చెప్పారు. ఇక ఆర్తి అగర్వాల్ మంచి స్నేహితురాలు నా సోదరి పెళ్ళికి కూడా వచ్చింది. తాను అమెరికా వచ్చాక కలిసే వాళ్ళం. అయితే ఇంట్లో విషయాలు పెద్దగా నాకు తెలియదు, తన మరణానికి కారణం తెలియదు అంటూ చెప్పారు.