Heroine Hera Rajagopal : దొంగ దొంగ, ప్రేమ లేఖ వంటి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హీరా రాజగోపాల్. అయితే ఆమె తెలుగులో లిటిల్ సోల్జర్స్ అలాగే ఆవిడే మా ఆవిడ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అంతఃపురం సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసారు హీరా. అయితే ఆవిడే మా ఆవిడ తరువాత పాడుతా తీయగా వంటి సినిమాలలో నటించినా ఆ తరువాత సినిమాలకు దూరంగా వెళ్లిపోయారు హీరా. మొదట్లో మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన హీరా సినిమాల్లో నటించడానికి అంత ఇంట్రస్ట్ చూపించలేదు. అయితే ఆమెను పదే పదే కొంతమంది డైరెక్టర్లు కలిసి మెల్లగా ఒప్పించడం కథ తనకు నచ్చడంతో హీరా నటన వైపు వచ్చారు.

అజిత్ తో పీకల్లోతు ప్రేమ…
అజిత్, దేవయాని కలిసి హీరో హీరోయిన్లు గా నటించిన ప్రేమలేఖ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఒక కార్పొరేట్ సంస్థ అధికారిగా కనిపించిన హీరా ఆ సినిమా తరువాత అజిత్ తో ప్రేమలో పడిపోయిందని అప్పట్లో బాగా పుకార్లు ఉండేవి. ఇద్దరూ బాగా ప్రేమించుకున్నా పెళ్లి వరకు వారి బంధం వెళ్ళలేదు. ఇక అజిత్ షాలిని వివాహం చేసుకుని సెటిల్ అయినా కూడా హీరా మాత్రం ఇప్పటికీ అజిత్ నే ప్రేమిస్తూ ఒంటరిగా మిగిలిపోయిందని అనుకుంటున్నారు అందరూ.

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న హీరా సినిమాలకు గుడ్ బై చెప్పడానికి అజిత్ తో ప్రేమాయణం కూడా ఒక కారణం అని కోలీవుడ్ లో టాక్. ఏదైనా 90 దశకంలో హీరోయినల్లో బాగా క్రేజ్ తెచ్చుకున్న హీరా ఇలా తక్కువ టైములోనే సినిమాలను మానేసి వెళ్లిపోవడం తన ఫ్యాన్స్ కి ఏమాత్రం నచ్చలేదు.
































