Heroine Honey Rose : ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’ అంటూ తెలుగు ప్రేక్షకుల మనోభావాలతో ఆడుకున్న చబ్బి బ్యూటీ హనీ రోజ్ మలయాళం ముద్దు గుమ్మ అని అందరికి తెలుసు. అయితే హనీ రోజ్ అసలు పేరు హనీ రోజ్ వర్గీస్ పుట్టింది కేరళలోని తోడుపూజా సమీపంలోని మూల మట్టంలో సైరో మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. పుట్టినప్పటి నుండి గోల్డెన్ స్పూన్ తో పుట్టినరోజు హనీ రోజ్ కుటుంబానికి బ్యూటీ అండ్ స్కిన్ కేర్ కి సంబంధించిన వ్యాపారం ఉంది. చదువుకునే వయసులోనే మోడలింగ్ వైపు అడుగులేసిన హనీ రోజ్ 2005 లో 14 ఏళ్ల వయసులో వినయన్ డైరెక్షన్ లో మలయాళంలో తన మొదటి సినిమా ‘బాయ్ ఫ్రెండ్’ లో మాణికట్టన్ కు స్నేహితురాలిగా నటించింది. అలా మొదలయినా హనీ రోజ్ ప్రస్థానం నేడు అగ్రహీరోయిన్ గా కొనసాగుతుండటం విశేషం.

బాలయ్య తో కంటే ముందే తెలుగు సినిమాల్లో నటించిన హనీ….
బాలయ్య తాజా సినిమా వీర సింహ రెడ్డి తో ఒక్కసారిగా మీనాక్షి రెడ్డి గా పాపులర్ అయిన హనీ రోజ్ కి ఈ సినిమా మొదటి సినిమా కాదు. అంతకు ముందు ముత్యాల సుబ్బయ్య గారి 50 సినిమా ఆలయం లో శివాజీ, లయ హీరో హీరోయినులుగా నటించిన సినిమాలో సెకండ్ లీడ్ గా నటించింది. ఇక ఆతరువాత ఈ వర్షం సాక్షిగా అనే మరో సినిమాలోనూ నటించింది హనీ రోజ్. ఇవే కాకుండా హనీ కన్నడ లో పలు హిట్ సినిమాల్లో నటించింది అలాగే తమిళంలో కూడా మంచి హిట్స్ అందుకుంది. ఇక మలయాళంలో అయితే హనీ రోజ్ ధ్వని అనే క్యారెక్టర్ తో అక్కడి వారికి బాగా కనెక్ట్ అయింది. చాలా మందికి హనీ .. ధ్వని, పొన్ను లాగానే పరిచయం.

ఇక వన్ భై టూ అనే మలయాళం సినిమాలో ఘాటు సీన్స్ తో లిప్ లాక్స్ తో రెచ్చిపోయిన హనీ రోజ్ బోల్డ్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. ఇటీవలే మోహన్ లాల్ మానిస్టర్ సినిమాలో మంచులక్ష్మి తో కలిసి రొమాన్స్ చేసి మరోసారి బోల్డ్ అట్టెంప్ట్ చేసింది.ఇలా బోల్డ్ గా నటించే ముద్దు గుమ్మను తెలుగు ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదో అని ఏమాత్రం డౌట్ లేకుండా డైరెక్టర్ గోపీచంద్ మలినేని వీర సింహ రెడ్డి లో మీనాక్షి క్యారెక్టర్ కు తీసుకున్నారు. ఇక ఆసినిమాలో హనీ రోజ్ నటన తెలుగు ప్రేక్షకులకు ఎంత నచ్చిందో అందరికి తెలుసు.
































