Heroine Madhavi Latha : రవిబాబు ‘నచ్చావులే’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి మాధవి లత. ఆ తరువాత నాని తో నటించిన ‘స్నేహితుడా’ సినిమా కూడా మంచి పేరే తెచ్చింది. కానీ తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఏ డైరెక్టర్లు మాధవి లతను పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఈమె రాజకీయాల్లోను బీజేపీ పార్టీలో చేరి క్రియాశీలకంగా ఉంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గురించి పంచుకున్నారు మాధవి లత.

స్నేహితుడా సినిమాలో అవమానం ఇప్పటికీ మర్చిపోలేను…
బుల్లితెర మీద అడుగుపెట్టి ఆపైన తన టాలెంట్ తో వెండితెర మీద హీరోయిన్ గా అడిగిపెట్టిన మాధవి లత మొదటి సినిమా నచ్చావులే తో మంచి హిట్ అందుకుంది. అయితే ఆ తరువాత వెంటనే మంచి ఆఫర్స్ అందుకోలేక పోయింది. తన రెండో సినిమా నాని హీరోగా వచ్చిన స్నేహితుడా. అందులో హీరోయిన్ గా మాధవి లత నటించగా ఆ సినిమా మంచి పేరే తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో తనను ఒక వ్యక్తి అవమానించాడని మాధవి రీసెంట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆ సినిమా డైరెక్టర్ చాలా మంచి వ్యక్తి అని అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉండే ఒక వ్యక్తి పలకరించినా నన్ను మీరు గమనించలేదని చెబితే నువ్వు కూడా హీరో లాగా సొంత కారులో వస్తే గమనిస్తారు, ప్రొడక్షన్ వాళ్ళు పంపే కారులో వస్తే ఎలా గమనిస్తాం అంటూ హేళన చేయడం నన్ను బాగా బాధపెట్టింది. సినిమా 2009 లో రాగా ఇప్పటికీ నేను ఆ విషయాన్ని మర్చిపోకేకపోతున్నాను అంటూ చెప్పారు. ఒక కారుకి బ్రాండెడ్ బట్టలకు ఉన్న విలువ ఇండస్ట్రీలో మనుషులకు ఉండదు అంటూ అభిప్రాయపడ్డారు మాధవి లత.































