Heroine Madhavi Latha : రవిబాబు ‘నచ్చావులే’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి మాధవి లత. ఆ తరువాత నాని తో నటించిన ‘స్నేహితుడా’ సినిమా కూడా మంచి పేరే తెచ్చింది. కానీ తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఏ డైరెక్టర్లు మాధవి లతను పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఈమె రాజకీయాల్లో బీజేపీ పార్టీలో చేరి క్రియాశీలకంగా ఉంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గురించి పంచుకున్నారు మాధవి లత.

పెళ్లి గురించి చెప్పలేను…
మాధవి లత ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేసినా మంచి ఆఫర్స్, పెద్ధ ప్రాజెక్ట్స్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇక సినిమాలను పక్కన బెట్టి పాలిటిక్స్ పట్టుకున్న మాధవి లత పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అంటూ చాలా మంది ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా అడుగుతుంటారు. వాటికి సమాధానం చెబుతూ దేవుడు ఎపుడు మంచి వ్యక్తిని చూపిస్తాడో అపుడు పెళ్లి చేసుకుంటా అంటూ మాధవి లత తెలిపారు.

అయితే కొంతమంది మాత్రం నేను చెప్పేది ఒకటైతే వాళ్ళొకటి అనేసుకుంటారు, ఉదాహరణకు నాకు పెళ్లి ఇష్టం లేదని అంటే నీకు పెళ్లి మీద నమ్మకం లేదా, నీ తల్లిదండ్రులు చేసుకున్నదేంటి అంటూ మాట్లాడుతారు. అసలు నేను చెప్పేది ఒకటైతే వాళ్ళు వేరే అర్థం చేసుకుంటారు అంటూ చెప్పారు. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో చెప్పింది కూడా ఊరికే అని ఎవరూ నిజానికి లేరని పెళ్లి టైం వస్తే కచ్చితంగా చేసుకుంటానంటూ చెప్పారు.

































