Heroine Prema : ‘దేవి’ సినిమాతో చెరగని ముద్ర వేసుకున్న నటి ప్రేమ. ధర్మచక్రం సినిమాలో వెంకటేష్ సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగమ్మాయి అనే ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడ కస్తూరి. తండ్రి టూరిజం డిపార్ట్మెంట్ లో డ్రైవర్ గా పనిచేస్తూ ఉండగా ప్రేమ గారికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన క్రికెటర్ అయ్యప్ప. ఇక ఆమె సినిమాల్లోకి వచ్చాక తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ రామన్న చౌదరి అలాగే ఢీ, చిరునవ్వుతో వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుత తెలుగులో నటించడం లేదు. ఇక బెంగళూరులో నివాసముంటున్న ఆమె తన హోమ్ టూర్ చేసారు. ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబాన్ని అలాగే ఇంటిని చూపించారు ప్రేమ.

సింపుల్ గా జీవిస్తున్న ప్రేమ…
హీరోయిన్ గా ఎంతో క్రేజ్ తెచ్చుకున ప్రేమ ఇంట్లో మాత్రం చాలా సాధారనంగా ఉంటారు. అందుకు కారణం తన తల్లి అంటూ ప్రేమ చెప్తారు. ఇంట్లో ఉంటే ఒక ఆర్టిస్ట్ అనే విషయం మర్చిపోయేలా చేస్తుందని కామన్ గా సింపుల్ గా ఉండటమే తనకు ఇష్టమని చెప్పిన ప్రేమ హోమ్ టూర్ వీడియోలో తన ఇంటిని చూపించారు. తన తల్లికి గార్డెనింగ్ అంటే బాగా ఇష్టమంటూ అందుకే మొక్కలు బాగా పెంచాము అంటూ చెప్పారు ప్రేమ.

ఇక తన కుటుంబాన్ని చూపించిన ప్రేమ గారు మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు నటించాలని ఉంది అంటూ మనసులోని మాట చెప్పారు. తనకు మళ్ళీ తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చినా మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తా అంటూ చెప్పారు ప్రేమ. ఇప్పటకే కన్నడ లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి మెప్పించారు.































