Heroine Ramya Krishna : ఒక్కప్పటి గ్లామర్ హీరోయిన్ ఇప్పటి శివగామి పేరు చెప్పక్కర్లేదు అందరికీ ఓ నీలంబరి, ఓ శివగామి అనగానే గుర్తొచ్చేది రమ్య కృష్ణనే. తొంబై లలో అందరు అగ్ర హీరోలతో ఆడిపాడిన రమ్య ‘భలే మిత్రులు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ‘సంకీర్తన’ వంటి సినిమాలో నటనకు మంచి గుర్తింపు వచ్చినా అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ అయింది మాత్రం రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన అల్లుడుగారు సినిమాతో. ఆ సినిమా విజయంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు రమ్యకృష్ణ.

భర్తగా కన్నా డైరెక్టర్ గానే ఎక్కువగా ఇష్టపడుతా…
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో ఒక వైపు చేస్తూనే మరో వైపు గ్లామర్ పాత్రలను చేసి అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయింది రమ్య. ఇక ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లాడింది రమ్య కృష్ణ. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. రీసెంట్ గా ‘రంగమార్తాండ’ సినిమాతో కృష్ణ వంశీ రమ్య కృష్ణ కలిసి మళ్ళీ చాలా ఏళ్ల తరువాత పనిచేసారు. చంద్రలేఖ సినిమా తరువాత మళ్ళీ ఇన్నాళ్లకు రమ్య కృష్ణ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ను రంగమార్తాండ సినిమాలో చేసారు. ఎపుడూ గంభీరంగా అరిచే పాత్రలో చేసే రమ్య కృష్ణ ఈ సినిమాలో సైలెంట్ గా కళ్ళతోనే మాట్లాడే పాత్రలో అధరగొట్టింది.

ఇక సినిమా గురించి, కృష్ణవంశీ డైరెక్షన్ గురించి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భర్త కన్నా కృష్ణ వంశీ డైరెక్టర్ గా నాకు నచ్చుతాడంటూ చెప్పారు రమ్య. తాను చాలా బాగా క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ చేయిస్తారని, ఆర్టిస్ట్ దగ్గర తనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ బాగా తెచ్చుకుంటాడు. అలా రాజమౌళి కుడా చేస్తాడు, సీన్ చెప్పడం హావభావాలు ఎలా ఉండాలి అన్నది కరెక్ట్ గా చెప్తారు అందుకే ఒక ఆర్టిస్ట్ అంత బాగా నటించగలరు అంటూ చెప్పారు రమ్య. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోసం ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తున్నపుడు బాగా వెతికారు ఇక నేనే చెప్పా కృష్ణ వంశీ కి నేనే చేస్తాలే ఇక ఏం వెతుక్కుంటావ్ అని, అలా ఈ క్యారెక్టర్ చేశాను అంటూ చెప్పారు.