Heroine Samantha : తెలుగులో హీరోయిన్ గా అగ్ర స్థానంలో ఉన్న సమంత నాగచైతన్య తో వివాహం జరిగి అక్కినేని కుటుంబానికి కోడలిగా వెళ్లినా కూడా సినిమాలను చేస్తూ తనని తాను ఛాలెంజింగ్ పాత్రలతో నిరూపించుకుంటూ వచ్చింది . అయితే ఇద్దరు విడిపోయి విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్న ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. విడాకుల తరువాత సమంత కెరీర్ స్లో అవుతుందని అనుకున్న ఆమె మాత్రం రెట్టింపు స్పీడ్ తో దూసుకెళ్ళింది. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంది. ఇక అంత బాగుందనుకునే లోపే సమంతకు ఆటో ఇమ్మ్యూన్ సమస్యతో బాధపడుతున్నట్లు స్వయంగా తానే ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఆమె కోలుకుని తిరిగి ఆమె ఒప్పుకున్న సినిమాలలో పనిచేస్తున్నారు. తాజాగా శకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత సినిమా గురించి పలు విశేషాలను పంచుకున్నారు.

అర్హ బోర్న్ యాక్టర్…..
శకుంతలం సినిమాలో శకుంతలగా నటిస్తున్న సమంత ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. గుణశేఖర్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాలో మెయిన్ లీడ్ సామ్ కాగా మరో ముఖ్య పాత్రలో అల్లుఅర్జున్ కూతురు అల్లు అర్హ నటిస్తోంది. ఈ సినిమాతోనే నటనలో అరంగేట్రం చేయనుంది అర్హ. అయితే ఈ సినిమాలో తన నటన చాలా బాగుందని తాను చాలా కాన్ఫిడెంట్ గా నటిస్తుందని సమంత కాంప్లిమెంట్స్ ఇచ్చారు. తాను యాక్టింగ్ నేర్చుకోవల్సిన పనిలేదు పుట్టుకనతోనే యాక్టింగ్ స్కిల్స్ వచ్చేసాయి అంటూ చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు సీనియర్ నటుల మధ్య తాను డైలాగు చెప్పే సీన్ ఉన్న చాలా చక్కగా తడబడకుండా చెప్పేస్తుంది.

తెలుగు చాలా స్పష్టంగా ఒక్క ఇంగ్లీష్ పదం వాడకుండా మాట్లాడుతుంది అర్హ అంటూ తన తల్లిదండ్రుల పెంపకం చాలా బాగుందని తన తండ్రి లాగే తాను తగ్గేదేలే అంట్లు నటిస్తోందని సమంత తెలిపారు. ఒక్క ఇంగ్లీష్ పదం కూడా మాట్లాడకుండా తాను తెలుగులో పలకరిస్తుందని తనకు ఇంగ్లీష్ పెద్దగా రాదని ఇంగ్లీష్ కావాలంటే స్కూల్ లో నేర్పుతారు తెలుగు స్పష్టంగా రావాలని తన పేరెంట్స్ తనకు స్పష్టమైన తెలుగు నేర్పించారు చాలా బాగా తన అభినయం ఉంది అంటూ తెలిపారు సమంత.