How to become Rich : మనలో చాలా మంది చదువుకున్నా మంచి ఉద్యోగం సంపాదించుకుని డబ్బు సంపాదించలేక ఒత్తిడికి లోనవుతుంటారు. మరికొంతమంది సరైన చదువు లేక అవకాశాలు అందుకోలేక పోటీ ప్రపంచంలో వెనుక ఉండిపోతారు. కానీ ఇప్పుడున్న కాలంలో ఇవేవీ డబ్బు సంపాదించడానికి ఆటంకాలు కాదు. కేవలం ఉండాల్సింది నువ్వు చేస్తున్నపనిమీద దృఢ నమ్మకం. నువ్వు చేసే పనిమీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు.

డబ్బు సంపాదించాలంటే ఉండాల్సింది అదే…
డబ్బు ఎలా సంపాదించవచ్చు, అవకాశాలకు ఎప్పుడూ కొదవ లేదు కానీ వాటిని అంది పుచ్చుకునే తెలివి, తెగువ ఉండాలి అంతే. మన చదువు మనకు జ్ఞానాన్ని ఇస్తుందే కానీ సంపద మాత్రం మన తెలివి, దృఢ నమ్మకం ద్వారానే సంపాదించాలి. ఒక ఉద్యోగం లో చేరి ఐదేళ్ళు పనిచేసి నేనింకా ఎందుకు బాగా డబ్బు సంపాదించలేక పోతున్నా అని ఆలోచించడం వ్యర్థం. ఎందుకంటే ఒకేపని కొన్నేళ్లు చేస్తే నువ్వు చేసిన పనికి ఎపుడు వచ్చిన జీతమే వస్తుంది అంతే, నువ్వు ఎదగలేవు. ఉదాహరణకు సత్య అనే ఒక వ్యక్తి ఐటి చేసి చిన్న ఉద్యోగం చేస్తూ బతుకు ఈడుస్తున్నాడు.
ఎన్ని రోజులు పనిచేసినా అతని ఆదాయంలో మార్పు లేదు. అలోచించి తన గ్రామంలో మేలురకమైన బియ్యం ఇక్కడ సహఉద్యోగులకు అమ్మడం మొదలు పెట్టి కొంత డబ్బు సంపాదించేవాడు. అయితే కొన్నాళ్లకు తను పనిచేస్తున్న కంపెనీ మూత పడే అవకాశం ఉందని తెలిసీ ఇక లాభం లేదని డబ్బు సంపాదనకు దుబాయ్ వెళ్ళాడు. ఇక అక్కడ కూడా ఉద్యోగం అంత మాత్రమే అని తెలిసీ అష్ట కష్టాలు పడి అక్కడి నుండి బయటపడి సౌదీ కు వెళ్ళాడు. అక్కడ మెకానిక్ గా పనిచేస్తూ ఇంకేదో చేయాలని అలోచించి కంప్యూటర్ మీద దృష్టి పెట్టాడు.

కంప్యూటర్ నేర్చుకోవడానికి పని అయిపోయాక నాలుగు మైల్లు నడిచి వెళ్లి నేర్చుకున్నాడు. ఇక పని చేసుకుంటూనే పెళ్లి డీవీడీ చేయడం, కంప్యూటర్ రిపేర్లు చేయడం మొదలు సినిమాలను ఇంటర్నెట్ లో కొని వాటిని డీవీడీ రూపంలో ఇండియన్స్ కి అమ్మే వరకు అన్నిచేస్తూ బాగా సంపాదించాడు. వలస వెళ్లిన ఇండియన్స్ తో చూస్తే సత్య ఒక అపార్ట్మెంట్ లో ఉంటూ సొంత కారు కలిగి కుటుంబంతో ఉన్నాడు. ఇలా డబ్బు సంపాదించడానికి సత్య దగ్గర ఉన్న సీక్రెట్ ఇప్పటికిప్పుడు డాక్టర్ కావాలని అనుకుంటే అవ్వగలరు. నమ్మకం నాకుంది అనే సమాదానం వస్తుంది. అభివృద్ధి చెందాలంటే డబ్బు సంపాదించాలంటే మన జాతకం, లేదా వాస్తు సరిగా ఉండటామో కాదు మనం చేసే పనిని నమ్మి ధైర్యంగా అడుగులేస్తే ధనలక్ష్మి మన వెంట వస్తుంది.



























