Hrithik Roshan : బాలీవుడ్ దర్శకుడు రాకేష్ రోషన్ కుమారుడు గా హృతిక్ సినిమా రంగ ప్రవేశం చేసాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో నటించినప్పటికీ 2000 సంవత్సరంలో వచ్చిన ‘కహోనా ప్యార్ హై’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. తరువాత వరుసగా ఫిజా, మిషన్ కాశ్మీర్, కబీ ఖుషి కబి గం వంటి సినిమాలు విజయాలు అందించాయి. తరువాత ఆశించిన విజయాలు రాలేదు. ఆ తరువాత కోయి మిల్ గయా, ధూమ్ 2, జోదా అక్బర్, క్రిష్ వంటి సినిమాలు ఆయనను సూపర్ స్టార్ ను చేసాయి. ఇపుడు తాజాగా హృతిక్ కు సంబందించిన ఒక విషయం వైరల్ అవుతోంది.

అభిమాని కాళ్ళు మొక్కగా వెంటనే స్పందించిన హృతిక్…
గర్వానికి హృతిక్ చాలా దూరం అని మరోసారి నిరూపించుకున్నాడు. తాజాగా ఒక ఫిట్నెస్ ప్రోగ్రాముకు హృతిక్ హాజరు కాగా ఆయనను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు కూడా వచ్చారు. అయితే ఒక అభిమాని హృతిక్ దగ్గరకు వచ్చి వెంటనే ఆయన కాళ్లు మొక్కాడు. అయితే వెంటనే హృతిక్ స్పందించి తిరిగి అభిమాని కాళ్లకు దండం పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్ అవుతోంది.

దీన్ని చూసిన నెటిజన్లు హృతిక్ చేసిన పనిపై స్పందిస్తున్నారు. కొంత మంది అది హృతిక్ రోషన్ మంచితనం అంటే అని కామెంట్ చేస్తుంటే ఇంకొంతమంది..‘‘హృతిక్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కలవాడు, అందుకే అభిమానులు ఆయన్ని సూపర్ స్టార్ అంటారు’’ అంటూ కామెంట్లు చేస్తూ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం తమిళ సినిమా ‘విక్రమ్ వేద’ సినిమాకు రీమేక్ హృతిక్ రోషన్ తీస్తున్న సినిమా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.































