Chiranjeevi: నేను బాధితున్నే.. డైరెక్టర్లు హడావిడిగా సినిమాలు చేయకండి.. డైరెక్టర్లకు క్లాస్ పీకిన చిరు!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ విషయం గురించి పూర్తిగా ఆలోచించి ఆ మాటలను గొంతులో నుంచి కాకుండా గుండెల్లో నుంచి వస్తుందని అందరికీ తెలిసిందే. ఇలా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి డైరెక్టర్లకు కాస్త చురకలాంటించారు. ఈ సందర్భంగా ఈయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో హీరోయిన్లను దర్శక నిర్మాతలను ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రేక్షకులు ఎప్పుడు కూడా కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తారు కంటెంట్ లేని సినిమాలను నిర్మొహమాటంగా తిరస్కరిస్తారని వెల్లడించారు.

ఇలా తాను నటించిన ఆచార్య సినిమా కూడా ఇదే కోవకి వస్తుందని ఈయన వెల్లడించారు. నేను కూడా బాధితుడేనని ఈ సందర్భంగా ఈయన ఆచార్య డిజాస్టర్ గురించి ప్రస్తావించారు. తాజాగా ఇండస్ట్రీలో విడుదలయ్యి హిట్ అందుకున్న బింబిసారా, సీతారామం, కార్తికేయ 2 సినిమాల విజయం గురించి ప్రస్తావించారు. ఇక డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ దర్శకులు ఎప్పుడు కూడా సినిమా కంటెంట్ పై ఫోకస్ పెట్టాలి కానీ కాంబినేషన్ల మీద, సినిమా రిలీజ్ మీద కాదని సినిమాలో కంటెంట్ లేకపోతే కాంబినేషన్ ఉండి ఏ లాభం అంటూ ఈయన తెలిపారు.

Chiranjeevi: కొరటాలను ఉద్దేశించే మెగాస్టార్ మాట్లాడారా..

చిత్ర పరిశ్రమ బాగుపడాలంటే అంతా డైరెక్టర్ చేతిలోనే ఉందని ఈ సందర్భంగా చిరంజీవి డైరెక్టర్లకు తనదైన స్టైల్ లో క్లాస్ పీకారు.ఇలా చిరంజీవి డైరెక్టర్లను ఉద్దేశించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈయన కొరటాల శివని ఉద్దేశించి చేశారని పలువురు భావిస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతోనే మెగాస్టార్ ఈ విషయాలను ప్రస్తావించారని తెలుస్తోంది.