Akhanda: అఖండ చిత్రబృందం పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
Akhanda: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది అభిమానులు వారి అభిమాన హీరో హీరోయిన్లను అనుసరిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రెటీలు సమాజానికి ఉపయోగపడే వాటి గురించి అవగాహన కల్పించడం వల్ల చాలా మందిలో మార్పు వస్తుందని భావిస్తుంటారు.
ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ సినీ కెరియర్ లోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రంగా నిలిచిన అఖండ సినిమా ఒకవైపు థియేట్రికల్ రన్ అవుతున్నప్పటికీ, మరోవైపు ఓటీటీలో కూడా తన హవా కొనసాగిస్తోంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లో అఖండ చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.బాలకృష్ణ నటించిన ఈ సినిమాలో ఒక సన్నివేశంలో బాలయ్య, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కారులో ప్రయాణిస్తూ సీట్ బెల్ట్ ధరించి ఉంటారు. ఈ సీన్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ ఫోటోలో హీరో హీరోయిన్ ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో..కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించండి ఎంత దూరమైనా ఎవరికి ఏమైనా సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఇలా బాలకృష్ణ అఖండ సినిమా ద్వారా ఎంతో మంచి విషయాన్ని తెలియజేయడంతో ట్రాఫిక్ పోలీసులు అఖండ చిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్‌లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…
ఆచార్యుల బోధనల్లో జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలు కనిపిస్తాయి. వాటిలో మాటల నియంత్రణ, సహనం అనే అంశాలు ప్రత్యేకంగా…
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…
దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…