Hyper Aadi : ఇటీవల నరేష్, పవిత్ర లోకేష్ ల గురించి సినీ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా సాగింది. ఇక సోషల్ మీడియా అంతా వీరి మీద బోలెడన్ని కథనాలతో నిండిపోయాయి. ఇక నరేష్ మూడవ భార్య అయిన రమ్య తెర మీదకు రావడంతో కథ మరో మలుపు తిరిగింది. విడాకులు ఇవ్వకుండానే మరో వివాహం ఎలా చేసుకుంటాడు అని రమ్య అనడం, తనకు ఎనిమిది ఏళ్ళ క్రితమే విడాకులు ఇచ్చానని, తన క్యారెక్టర్ గురించి ఆరోపించడం, ఇలా రోజుకోమలుపు తిరగడం తెలిసిందే. ఈ గొడవలన్నీ మన రాష్ట్రంలోనే కాక పక్క రాష్ట్రం అయిన కర్ణాటక లో కూడా పాకాయి. అయితే ప్రస్తుతం ఈ గొడవలు కాస్త సర్దుమనిగాయి అనుకుంటుండగా, తాజాగా హైపర్ ఆది వేసిన పంచులు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.

శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ లో నవ్వులు పూయించిన సెటైర్లు…
ఎపుడూ హాట్ టాపిక్స్, రన్నింగ్ ఇష్యూ లని తన స్కిట్లలో వాడి నవ్వులు పూయించే ఆది, తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో నరేష్, పవిత్ర లోకేష్ ల మీద సెటైర్ వేసాడు. ఆదివారం ప్రసారం అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఈ స్కిట్ ప్రసారం అయ్యింది. ఆది, రాం ప్రసాద్‌ల మధ్య కాలెండర్ లాంచ్ విషయంలో గొడవ రావడం, సపోర్ట్ కోసం జోడిలను పిలవడం జరుగుతుంది. పరదేశీ, నూకరాజు, ప్రవీణ్ వంటి వారు జోడిలతో ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పొట్టి నరేష్ విషయం రావడం.. నరేష్ కు జోడిగా ఎవరూ లేకపోవడంతో పవిత్ర ముందుకు వస్తుంది.

అపుడు వెంటనే ఆది నీ పేరు ఏంటి అని పవిత్రని అడుగగా, తాను పవిత్ర అని చెబుతుంది. తరువాత వాడి పేరు ఏంటి అని అడుగగా… నరేష్ అని సమాధానం చెప్పగా, ఇంకేముంది అన్నట్టుగా వెళ్తాడు. అయితే ఫస్ట్ అది ఎవరికీ అర్థంకాలేదు. పంచ్ ప్రసాద్, పవిత్ర నరేష్ అని అంటున్నాడు అని క్లారిటీ ఇవ్వడంతో సెట్ మొత్తం నవ్వులతో మునిగి పోయింది.



























