Hyper Adhi : ఈటీవీలో ప్రసారమయ్యే షోలలో జబర్దస్త్ తరవాత అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రతివారం ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్న ఈ షోలో సెలబ్రిటీలు, జబర్దస్త్ వాళ్ళు చేసే సందడి మామూలుగా ఉండదు. ఈవారం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ను ఈటీవీ వాళ్ళు విడుదల చేసారు. తెలంగాణ లో ప్రస్తుతం జరుగుతున్న బోనాల పండగ కాన్సెప్ట్ తో ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ఉండబోతోంది. ప్రస్తుతం తెలంగాణ అంతా బోనాల జాతరతో మునిగితేలుతుండడం తో ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా బోనాల జాతర చేసారు.

ఆది కి వార్నింగ్ ఇచ్చిన కనకవ్వ…
ఎప్పటిలాగే షోలో సెలబ్రిటీలు కూడా సందడి చేసారు. కార్తికేయ సినిమా రెండో భాగం విడుదల సందర్బంగా నిఖిల్, అనుపమ ఆ సినిమా ప్రొమోషన్స్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ కి వచ్చారు. ఇక అనుపమ బావ బోనాల జాతరలో తప్పిపోయాడంటూ స్కిట్స్ చేయడం ఇమ్మానుయేల్ నేనే ఆ బావని అంటూ రావడం నవ్వు తెప్పిస్తాయి. ఇక అనుపమ తన సింగింగ్ టాలెంట్ తో శతమానం భవతి సినిమాలోని పాటతో ఆకట్టుకుంది.

ఇక బాలయ్య, పవన్ కళ్యాణ్ డూపులతో డాన్సులు వంటివి ఆకట్టుకున్నాయి. ఇక ప్రోమో చివర్లో అమ్మవారి గా బుల్లితెర నటి హావభవాలు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక రష్మీ ఆది వద్దకు వెళ్లి నువ్వు కనకవ్వ డాన్స్ చేసారు కదా ఎలా అనిపించింది అని అడుగగా ఆది కనకవ్వ చేతిలో చేయి వేసి కళ్ళతో సైగ చేస్తుంటే కనకవ్వ నాలుక మడతపెట్టి వార్నింగ్ ఇచ్చినట్లుగా చేస్తుంది. దీనితో ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు ఆతరువాత నవ్వేశారు. నర్సాపెల్లి అంటూ పాట పాడీ మంచి గుర్తింపు పొందిన తెలంగాణ జానపద కళాకారిణి కనకవ్వ. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆమె సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంది.

































