Movie News

సాయి ధరమ్ తేజ్ ను ప్రమాదం నుంచి కాపాడింది.. ఇతనే..!

సాధారణంగా మనకు ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే ఒక గంట సమయాన్ని గోల్డెన్ అవర్స్ అంటారు. ఈ సమయంలో సరైన చికిత్స అందిస్తే ఆ ప్రమాదం నుంచి ఎవరైనా కూడా బయటపడతారు. మరి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కుకూడా గోల్డెన్ అవర్స్ లో ఉండడం వల్లే ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే సరైన సమయానికి ఆసుపత్రికి తరలించడం వల్లే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు వెల్లడించారు. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే అతనిని చూసింది ఎవరు? ప్రమాదం జరిగినప్పుడు సాయి ధరమ్ తేజ్.. ఏలాంటి పరిస్థితులలోకి వెళ్ళారు అనే విషయాన్ని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్ తేజ్ కెబుల్‌ బ్రిడ్జీ మీదుగా ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే కెబుల్‌ బ్రిడ్జ్‌ మీదుగా హైటెక్ సిటీ మార్గం గుండా బైక్‌పై వెళ్తున్న అబ్దుల్‌ ఫర్హాన్ అనే వ్యక్తి ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే అక్కడికి చేరుకొని సాయి ధరంతేజ్ ను లేపి అతని మొహం పై నీళ్లు కొట్టినట్లు తెలిపారు.

అప్పటికే సాయిధరమ్ తేజ అపస్మారక స్థితిలోకి వెళ్లారనీ, ఆయనకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండటంతో వెంటనే 100 కి 108 కి ఫోన్ చేశానని తెలిపారు. అంబులెన్స్ కు ఫోన్ చేసి పది నిమిషాల్లో అక్కడికి చేరుకోవడం ఆ తరువాత అతనిని దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయి ధరమ్ తేజ్ ఫిట్స్ రావడంతో వైద్యులు వెంటనే అతనికి చికిత్స చేయడంతో అతనికి పెద్ద ప్రమాదం తప్పిందని తెలియజేశారు.

ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ ను కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ అప్పటివరకు తన హీరో అనే విషయం కూడా తెలియదని తెలియజేశారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవడానికి గల కారణం రోడ్డు పై బురద ఉండడం చేత స్కిడ్ అయ్యి కింద పడ్డారని అబ్దుల్ తెలిపారు. అతడు హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ హెల్మెట్ ఒక చోట బండి ఒక చోట పడిపోయిందని ప్రత్యక్షసాక్షి అబ్దుల్ ఫర్హాన్ తెలిపారు. అబ్దుల్ ఫర్హాన్ నిజాంపేట్ క్రాస్ రోడ్డులో కొత్తగా ప్రారంభమైన సిఎంఆర్ షాపింగ్ మాల్ లో వాలెట్ పార్కింగ్ చేస్తుంటారని తెలిపారు. ఈ విధంగా ఒక హీరోని ప్రమాదం నుంచి పాడిన రియల్ హీరో అబ్దుల్ ఫర్హాన్ పై మెగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

20 hours ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

20 hours ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

22 hours ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

23 hours ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

23 hours ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

23 hours ago