IAS Amrapali : తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్కార్ ఏర్పడ్డాక సీఎం పేషిలో ఇంతకు ముందు వారినే కొనసాగిస్తారా లేక కొత్త సివిల్ సర్వంట్స్ ను రేవంత్ రెడ్డి తీసుకుంటారా అనే అంశంలో ఇంకా క్లారిటీ రాకపోయినా మాజీ సీఎంకి పనిచేసిన స్మిత సభర్వాల్ ఇప్పటి వరకు కొత్త సీఎంను మర్యాదపూర్వకంగా కలవకపోవడం, డెప్యూటేషన్ మీద ఉన్న ఆమ్రపాలి మర్యాదపూర్వకంగా వచ్చి కలవడంతో నయా సీఎం పేషి నుండి స్మిత అవుట్ ఆమ్రపాలి ఇన్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సీఎమ్ఓ సెక్రెటరీగా ఆమ్రపాలి…?
మాజీ సీఎం కెసిఆర్ ఉన్నపుడు సీఎంఓ సెక్రెటరీగా స్మిత సభర్వాల్ పనిచేయగా రేవంతబరెడ్డి గారు సీఎం అయ్యాక ఆమె వచ్చి కలవకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఆమెను బదిలీ చేస్తారనే ఆమె సీఎంను వచ్చి కలవలేదనే వార్తలు వినిపించాయి. ఇక తాజాగా 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని కాటా ఆమ్రపాలి తాజాగా రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడంయతో సీఎం పేషిలోకి ఆమెను తీసుకుంటారనే చర్చలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి చెందిన ఆమ్రపాలి విభజన తరువాత వరంగల్ కలెక్టర్ గా పనిచేసారు.

ఆపైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే గతంలో తెలంగాణ ఎన్నికల అధికారిగా కూడా పనిచేసిన ఆమ్రపాలి పిఎంఓ నుండి పిలుపు రావడంతో అక్కడికి డెప్యూటేషన్ మీద వెళ్లారు. తాజాగా డెప్యూటేషన్ పూర్తి చేసుకున్న ఆమె తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పనిచేయడానికి వచ్చారు. అలా కొత్త సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా పలకరించారు. అయితే ఆమ్రపాలి ఎక్కడ పనిచేసినా తన మార్కు పనితనం చూపించి మంచి పేరు తెచ్చుకున్నారు.





























