ప్రతి సంవత్సరం మనం వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం గురించి మాట్లాడుకుంటే గత కొన్ని నెలలుగా అందుకు భిన్నంగా కరోనా కాలం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మాస్క్, శానిటైజర్లు మనుషులు తప్పక ఉపయోగించాల్సిన వస్తువుల జాబితాలో చేరాయి. వైరస్ ఎవరికి ఏ విధంగా సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ బారిన పడుతున్నామని కొందరు వాపోతున్నారు.

అన్ లాక్ సడలింపులకు ముందు దేశంలో 6,000కు అటూఇటుగా కేసులు నమోదు కాగా గత కొన్ని రోజులుగా 90,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే మాస్క్ ల వల్ల చాలామంది అవతలి వ్యక్తుల ముఖాలను గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్ లోకి కొత్తగా ఫేస్ మాస్క్ లు అందుబాటులోకి వస్తుండగా ప్రజలను ఈ మాస్క్ లు తెగ ఆకర్షిస్తున్నాయి. మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా తాజాగా తన ముఖాన్నే మాస్క్ పై ప్రింట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మాస్క్ తప్పనిసరి కావడంతో కొందరు తమ తెలివికి పదును పెట్టి కొత్తరకం మాస్కులను అందుబాటులోకి తెస్తున్నారు. డ్రెస్ కు సూట్ అయ్యే మాస్క్ లను, కొత్త మెటీరియల్ సహాయంతో చూడగానే వావ్ అనిపించే మాస్క్ లను తయారు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వేర్వేరు ఫేస్ మాస్క్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కొన్ని నెలల క్రితం పూణే వ్యాపారవేత్త ధరించిన బంగారు మాస్క్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఒక లేడీ లైట్లు జిగేల్ మనిపించే మాస్క్ ను ధరించి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఏలియన్ రూపాన్ని తలపించే మరో మాస్క్ నెటిజన్ల దృష్టిని తెగ ఆకర్షిస్తోంది. కొత్త టెక్నాలజీతో తయారు చేసిన ఎయిర్ ప్యూరిఫైయింగ్ మాస్క్ కూడా చూపరులను తెగ ఆకట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here