Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు. సమంత ఇండస్ట్రీలో గత దశాబ్ద కాలం పైగా హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈమె కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళం హిందీ సినిమాలలో కూడా నటించారు. ఇలా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

ఇకపోతే ఇటీవల కాలంలో సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విడాకుల బాధ నుంచి బయటపడిన తర్వాత కెరియర్ పరంగా ఈమె ఎంతో బిజీ అయ్యారు. అయితే వరుస సినిమాలకు కమిట్ అయిన తర్వాత సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డారు. దీంతో ఈమె సినిమాలను పూర్తి చేసి ఏకంగా ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.
ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత ఎన్నో రకాల చికిత్సను తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడ్డారని తెలుస్తుంది. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా సమంత మలేషియా వెళ్లారని తెలుస్తుంది.
విడాకులకు ఈమె కారణమా..
ఇలా మలేషియా వెళ్ళినటువంటి సమంత అక్కడ తన స్నేహితురాలు మేఘన అనే అమ్మాయిని కలిశారు. దీంతో వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోని సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా సమంత ఈ ఫోటోని షేర్ చేయడమే కాకుండా ఈ ఫోటోని షేర్ చేస్తూ నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే ఆ నిర్ణయానికి ఫేస్ పెడితే అది మేఘన అవుతుందని తెలిపారు. ఇలా నా ప్రతి నిర్ణయం వెనుక ఈమె ఉంది అంటూ సమంత పోస్ట్ చేయడంతో మీరు విడాకులు తీసుకోవడానికి కూడా ఈమె కారణమా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.





























