Viral Video: ప్రాణ భయం అనేది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అటు మనిషికి అయినా.. ఇటు నోరులేని జంతువులకు అయినా. అయితే అటవీ ప్రాంతంలో మాత్రం.. క్రూర జంతువుల పని కేవలం వేట మాత్రమే. అంటే వాటి కంటే చిన్న ప్రాణి అయిన వాటిని వేటాడి తింటుంటాయి. అవే వాటికి ఆహారం. సింహాలు, పులులు అయితే జింకలను, దుప్పిలను వేటాడి మరీ తినడం మనం చాలా వరకు డిస్కవరీ చానళ్లో చూసి ఉంటాం.

అయితే వాటి బారి నుంచి తప్పించుకోవడానికి ఆ జింకలు పడే బాధ అంతా ఇంతా కాదు. వాటికి సాధ్యమైనంత వరకు పరుగు పెడతాయి. చివరకు చిరుత, పులుల పరుగుకు అవి తట్టుకోలేక పట్టుపడతాయి. ఇంకేముంది చటుక్కున నోటిలో పెట్టేసుకొని తింటాయి.

అయితే ఇక్కడ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఏముందంటే.. జింకలు తమను తాము కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నం అది. జింకలను పులి, సింహాలే కాదు.. అడవి కుక్కలు కూడా వేటాడుతాయి.
అక్కడకు కనుకు కుక్కలు వెళ్లితే..
వాటికి దూరంగా ఉండేందుకు జింకలు ప్రయత్నాలు చేస్తుంటాయి. తాజాగా ఈ వీడియోలో అడవి కుక్కుల గుంపు ఒక్కసారిగా వాటిపై పడేందుకు ప్రయత్నిస్తాయి. ఈక్రమంలో వాటి నుంచి తప్పించుకునేందుకు ఆ జింకలు ఓ మాస్టర్ ప్లాన్ వేశాయి. పక్కనే ఉన్న ఓ బండరాయిపై ఎక్కాయి. అది భూమికి చాలా ఎత్తులోనే ఉంది. ఆ మూడు జింకలు ఎత్తైన రాయి ఎక్కి.. తమను తాము కాపాడుకునే ప్రతయత్నం చేశాయి. అయితే కొన్ని కుక్కలు ఆ రాయి ఎక్కినా.. ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే.. ఆ జింకలు ఆ రాయికి చివరన నిల్చున్నాయి. అక్కడకు కుక్కలు వెళ్లలేక పోయాయి. అక్కడకు కనుకు కుక్కలు వెళ్లితే.. కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా కుక్కలకు అక్కడకు వెళ్లడం సవాల్ గా మారింది. కొన్ని కుక్కలు వాటిని చేరుకునేందుకు రాయి అంచు వరకు వెళ్లినా.. జింకలు మాత్రం వాటికి చిక్కలేదు. కుక్కల ప్రయత్నం విఫలం అవ్వడంతో.. అవి సేఫ్ అయ్యాయి. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.
Balancing life…
— Susanta Nanda IFS (@susantananda3) February 23, 2022
Keeping calm at the face of death.
????MalaMala Game Reserve pic.twitter.com/NctUAywQRW




























