Imandhi Ramarao : సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అందమైన రూపంతో పాటు అందమైన గాత్రంతో అకట్టుకున్న సింగర్. ఆమె పాటను ఎంత వినసొంపుగా పాడుతుందో అంతే బాగా హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పగలదు. వందల పాటలతో పాటు డబ్బింగ్ కూడా చెప్పిన సునీత వ్యక్తిగత జీవితం మాత్రం అంత మధురంగా సాగాలేదు. చిన్న వయసులో వివాహం అది కాస్తా బెడిసికొట్టి ఆ తరువాత మళ్ళీ పిల్లలను పెద్దవాళ్ళను చేసి ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్న సునీత చాలా ఆనందంగా తన జీవితానని కొనసాగిస్తోంది. ఇక ఆమె జీవిత విశేషాల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు అయన అభిప్రాయాలను పంచుకున్నారు.

బాలు తో ఎనలేని అనుబంధం…
సింగర్ సునీత చూడటానికి చాలా సుకుమారంగా ఉన్నా చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది, తనజీవితం గురించి చాలా బోల్డ్ సమాధానాలు చెబుతుంది అంటూ ఇమంది గారు చెప్పారు. ఇక ఒకానొక అవార్డు ఫంక్షన్స్ ఏఆర్ రెహమాన్ ను అందరూ ప్రశంసిస్తున్న సమయంలో ఆయన గొప్ప కాదు ఆయన గురువు అంటూ ఇళయరాజా అంతటి వారు లేరు అంటూ చెప్పడం తన ధైర్యానికి నిదర్శనం అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.

అది రెహమాన్ ను కించపరచడం కాదు కేవలం ఇళయరాజా గొప్ప అందరికంటే అని చెప్పడం మాత్రమే అంటూ చెప్పారు. ఇక సింగర్ బాలు కి సునీతకి మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు ఇమంది గారు. పాటల పరంగా ఎక్స్ప్రెషన్స్ బాగా పలికించి పాడటంలో బాలు కి ఎవరూ పోటీ లేరు. ఇక సునీత కూడా ఆయనకు ధీటుగా భావాలు పలికిస్తూ పాటపడుతుంది అంటూ చెప్పారు. ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది, సునీత కు బాలు గారంటే చాలా ఇష్టం అలాగే గౌరవం. అదీకాక వాళ్ళు నిజంగా కూడా బంధవులు అవుతారు. ఆయన సునీత కు మావయ్య అవుతారు అంటూ ఇమంది గారు ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

































