Imandhi Ramarao : నువ్వు నేను, మనసంతా నువ్వే, చిత్రం వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుని ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయిన ఉదయ్ కిరణ్ ఆ తరువాత చిరంజీవి కూతురుతో ఎంగేజ్మెంట్, అది క్యాన్సిల్ అవడం, ఆ తరువాత సినిమాలు తగ్గి పోవడంతో నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకుని మరణించారు. కానీ ఆయన లేని లోటు నేటికీ ఆయన అభిమానుల్లో ఉంది. ఆయన అంత డిప్రెషన్ లోకి వెళ్ళడానికి గల కారణాలు చిరంజీవి కూతురుతో అసలు ఎందుకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది వంటి విషయాలను సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు విశ్లేషించారు.

పవన్ కళ్యాణ్ గన్ తో బెదిరించాడా…
ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుని ఒక స్టార్ హీరోగా ఎదుగుతున్న క్రమంలో మెగాస్టార్ చిరు తన కూతురు సుస్మితకు ఉదయ్ కిరణ్ కు ఎంగేజ్మెంట్ చేసారు. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. కారణాలు బయటకు తెలపకపోయినా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఉదయ్ కిరణ్ ను చుపుతానంటూ గన్ తో బెదిరించాడనే రూమర్ ఉందంటూ ఇమంది గారు మాట్లాడారు. అయితే ఆ తరువాత సినిమా అవకాశాలు ఉదయ్ కి రాకుండా మెగాస్టార్ చేసారంటూ ఉన్న పుకారు అపద్ధం అంటూ తెలిపారు.

అలా చేయాల్సిన అవసరమా చిరంజీవి కి లేదంటూ తెలిపారు. కారణాలు ఏవైనా ఎంగేజ్మెంట్ రద్దు అయ్యాక ఉదయ్ కిరణ్ బాగా మానసికంగా క్రుంగిపోయాడు. ఇక ఆపై వచ్చిన వరుస ఫెయిల్యూర్స్ కూడా బాధించాయి. ఇక సరైన వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా అనాలోచితంగా పెళ్లి చెసుకొని ఆ తరువాత ఇబ్బంది పడ్డాడు. ఏ బాధ ఎవరితోనూ చెప్పుకోలేక తనలో తానే కుంగి పోయి చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటూ అభిప్రాయపడ్డారు.






























