Imandi Ramarao : సినిమాల్లో విలన్ అంటే భారీ ఖాయంతో చూడగానే భయపడేలా రూపంతో గంభీరంగా ఉంటారనే భావనతో ఉంటారు. ఇక పాత సినిమాల్లో విలన్ అంటే చూడగానే ముఖంలో ఆ క్రూరత్వం కనిపించేలా ఉండేవారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి చూడచక్కని రూపం, ఒడ్డు పొడుగుతో విలనిజం లో కొత్త ట్రెండ్ సెట్ చేసారు. ఆయనే విలనిజం లో గ్లామర్ తెచ్చిన ఆర్ నాగేశ్వరావు గారు. ఆరడుగుల ఎత్తు, అందమైన ముఖ వర్చస్సు తో చూడగానే ఆకట్టుకునే అందంతో విలనిజం పండించారు నాగేశ్వరావు గారు. రాజనాల నాగేశ్వరావు గారిది హైదరాబాద్ అయితే సినిమాల్లోకి యాధృచ్చికంగా వచ్చిన ఆయన విలనిజం లో కొత్త ట్రెండ్ సెట్ చేసారు.

విలాసవంతమైన జీవితం… 33 ఏళ్లకే మరణం…
రాజనాల నాగేశ్వరావు గారు సినిమాల్లోకి వచ్చి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి హీరోల సినిమాల్లో వారికి ధీటుగా విలన్ పాత్రలో జీవించారంటూ ఆయన గురించి ఇమంది రామారావు గారు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. నాగేశ్వరావు గారు సిగరెట్ తాగే స్టైల్ కి అప్పట్లో అభిమానులు ఉండేవారని, రింగు రింగులుగా పొగ వదలడం ఆయన స్టైల్ అంటూ చెప్పారు. ఇక ఆయనకు జంతువులను వేటాడడం హాబిగా ఉండేదని పులులను కూడా వేటాడేవారని ఇమంది గారు చెప్పారు. సినిమాల్లో మొదటి సారి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేసిన వ్యక్తి నాగేశ్వరావు గారేనని చెప్పారు.

ఇక ఆయన డబ్బు గురించి ఏనాడూ ఆలోచించలేదని, చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపారని, దురదృష్టవశాత్తు చిన్నవయసులో 33 ఏళ్లకే గుండెపోటు కారణంగా మరణించారని ఇమంది గారు తెలిపారు. ఇక ఆయన వారసుడిగా కొడుకు సినిమాల్లోకి వచ్చినా రానించలేకపోయాడని చెప్పారు. నాగేశ్వరావు గారు అక్కినేని వారి ‘దేవదాస్’ సినిమాలో ఏఎన్ఆర్ గారికి అన్న పాత్రలో నటించారు. అలాగే ‘దొంగరాముడు’ వంటి సినిమాలో విలనిజం చూపించారు. ఇక హీరోగా కూడా రావాలని అనుకున్నా ఈ లోపు అయన మరణించారు.


































