Imandi Ramarao : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు వివాదలు కొత్త కాదు. అయితే ఈసారి రాసలీలల వీడియోతో మరో సారి కాంట్రవెర్సీ అయ్యాడు. ఒక మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిన వీడియో తో అడ్డంగా దొరికిపోయాడు. వీడియోలో మహిళతో రొమాంటిక్ మాటలు చెబుతూ అడ్డంగా బుక్కయ్యాడు. ఇక ఈ వీడియో ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారి తెగ వైరల్ అయింది. ఇక ఈ వీడియో ఫేక్ అంటూ ఎంపీ వాదిస్తు మీడియా మీటింగ్స్ లో అసభ్యకర భాషతో మాట్లాడుతున్నాడు. ఇక ఇది ఫేక్ కాదు ఒరిజినల్ అని ప్రతిపక్షం చెబుతోంది. ఇక ఇష్యూ మీదా అనలిస్ట్ ఇమ్మంది రామారావు స్పందించారు.

గొప్పగా పని చేశాడా 500 కార్లతో ఊరేగింపు చేయడానికి సిగ్గుండాలి…
గోరంట్ల మాధవ్ ఇష్యూ ఇంకా మర్చిపోకముందే ఎంపీ గారు ఆయన సొంత నియోజకవర్గం లో 500 కార్లతో ఊరేగింపుగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏదైనా రాష్ట్రానికి కేంద్రం నుండి ప్రయోజనాన్ని తెచ్చాడా లేకపోతే ఇంకేదైనా సాధించాడా అలా ఊరేగింపు చేయడానికి సిగ్గుండాలి అంటూ మాట్లాడారు. అది ఫేక్ అని వాళ్ళే అనుకుంటే సరిపోతుందా ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించి నిరూపించుకునే పని లేదా.. ఇలాంటి ఒక వీడియో బయటికి వచ్చినపుడు ప్రభుత్వంలోని పెద్దలు ఎలా మాట్లాడాలో తెలియదా..

ఆయనను వెనకేసుకువచ్చేలా మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రజాక్షేత్రం లోకి ఎలా వెళ్లాలని అనుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. నిజంగా ఎంపీ ఇలాంటి ఒక పని చేశాడంటే చర్యలు తీసుకుంటాం మా పార్టీ తరుపున అనే ఒక భరోసా ఇవ్వలేదు, ఆయన చేసినదాంట్లో తప్పేంటి అన్న ధోరణిలోనే మాట్లాడుతున్నారు. ఒక గౌరవ ప్రధమైన పదవిలో ఉండి ఎలా మెలగాలో తెలియదా సమాజానికి ఏమి చెప్పాలనుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేసారు ఇమ్మంది రామారావు.



































