Imandi Ramarao : ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడిపోవడాలు ఇవన్నీ కామన్. ఇక కొంతమంది గాఢంగా ప్రేమించుకున్నా ఎందుకనో పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్లతో లైఫ్ షేర్ చేసుకుంటారు. బయట సమాజంలో కూడా ఇలాంటివి జరుగుతాయి కానీ సినిమా ఇండస్ట్రీలో ఇలా జరగడం వింతే. అలా ఒక హీరో, హీరోయిన్ గురించి అప్పట్లో బాగా పూకార్లు వినిపించాయి. ఇద్దరూ పీకల్లోతు ప్రేమించుకున్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపించేవి. కానీ ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు. దురదృష్టవషాత్తు ఆ హీరోయిన్ మరణించింది కూడా. ఆహీరో, హీరోయిన్ ఎవరో కాదు తరుణ్, ఆర్తి ఆగర్వాల్. ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఉండి అందరు అగ్ర హీరోలతో నటించింది.

పీకల్లోతూ ప్రేమలో ఆర్తి అగర్వాల్…
తరుణ్, ఆర్తి అగర్వాల్ మొదటి సినిమా ‘నువ్వులేక నేనులేను’ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా పెద్ద హిట్. ఆ తరువాత మళ్ళీ తరుణ్ తో ‘సఖియా’ సినిమా చేశారు. అయితే మొదటి సినిమాతోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారానే వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. ఇక ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ ఆర్తి అగర్వాల్ తరుణ్ ను పీకల్లోతు ప్రేమించింది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఒకానొక సందర్బంలో చెల్లితో, తరుణ్ తో కలిసి రెస్టారెంట్ కి వెళితే అక్కడ చెల్లి తరుణ్ తో క్లోజ్ గా మూవ్ అయిందని చెల్లితోనే గొడవ పడిందట ఆర్తి అగర్వాల్, ఈ విషయం అప్పట్లో బాగా వినిపించింది. ఇక తరుణ్ వాళ్ళ ఆమ్మ రోజా రమణి వాదన మాత్రం ఇంకోలా ఉంది అంటూ చెప్పారు ఇమంది.

తరుణ్ అందరూ హీరోయిన్లతో బాగానే ఉండేవాడు. ఇంటికి వచ్చి వెళ్ళేవారు ఆ మాత్రానికే ప్రేమ అంటూ పుకార్లు లేపారు అంతేకాని తరుణ్ ఎవరినీ ప్రేమించలేదని చెప్పారు. ఇక ఆర్తి ఆగర్వాల్ సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే తండ్రి వత్తిడి కారణంగా పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఎన్నో రోజులు లేదు, విడాకులు తీసుకుని మళ్ళీ సినిమాల్లో నటించాలని అనుకుంది. అందుకోసం సర్జరీ చేయించుకుని అది వికటించి మరణించింది అంటూ ఇమంది గారు చెప్పారు. అయితే తరుణ్ కెరీర్ కూడా ఈ ఇష్యూ తో పోయింది. సినిమాలు తగ్గిపోయాయి అంటూ అభిప్రాయపడ్డారు.

































