Imandi Ramarao : సీనియర్ నటి లక్ష్మి, ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ అలాగే ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలను చేసిన ఆమె దాదాపు అన్ని సౌత్ భాషలలో నటించారు. తమిళంలో మొదలు పెట్టిన ఆమె వరుసగా కన్నడ, మలయాళం, తెలుగు అన్ని భాషల్లోనూ నటించింది. ఇక హిందీ లో కూడా జూలీ సినిమాతో మంచి హిట్ అందుకుంది అలానే అవార్డులను కూడా అందుకుంది. నిజానికి లక్ష్మి గారి తల్లి తమిళ హీరోయిన్ రుక్మిణి గారు అలానే తండ్రి నిర్మాత, డైరెక్టర్ స్క్రీన్ రైటర్ అయిన వై వి రావు గారు. వీరి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మి గారి సినిమా కెరీర్, వ్యక్తిగత విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

ఆ హీరోని చాలా గాఢంగా ప్రేమించి, వద్దనుకుంది…
లక్ష్మి గారు తన కెరీర్ లో చాలా దూకుడుగా ఉండేది. మంచి సక్సెస్లు అందుకుంటూనే తనతో ఎవరైనా జోకులు వేయడం, వెకిలిగా మాట్లాడితే మొహం మీదే చెప్పేసేదట. కొన్నిసార్లు ఎవరైనా తనతో తప్పుగా ప్రవర్తిస్తే హీరో అయినా సరే చెంప పగులగొట్టేదట. అలా లౌక్యం తెలియకపోవడం వల్ల చాలా అవకాశాలు సినిమాల్లో కోల్పోయింది. ఇక తను ప్రేమించి మొదట ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా ఆ తరువాత విడిపోయింది.

ఆ తరువాత హీరో రంగనాథ్ ను ఇష్టపడ్డారట. ఇమంది రామారావు గారు ఈ ఆసక్తికర విషయాల గురించి పంచుకున్నారు. సింగీతం శ్రీనివాస్ రావు గారి సినిమా పంతులమ్మ లో లక్ష్మి గారు రంగనాథ్ గారు జంటగా నటించారు. ఆ సినిమా సమయంలోనే ఆయన మీద ఇష్టం ఏర్పడింది. దీంతో ఆయనతో కొంచెం చనువుగా వ్యవహరించడం చేసింది. ఇక రంగనాధ్ గారికి అప్పటికే పెళ్లయింది. ఇక ఈ పంచాయతీ నాగేశ్వరావు గారి వరకూ వెళ్ళింది. రంగనాథ్ గారి భార్య నాగేశ్వరావు గారి దగ్గర ఆమె తన భర్త ప్రవర్తన అనుమానం కలిగిస్తోందని చెప్పగా ఆయన సర్ది చెప్పి పంపారట. ఇక లక్ష్మి గారికి ఈ విషయం తెలిసి నా వల్ల ఒక కుటుంబం నాశనం అవడం నాకిష్టం లేదు అంటూ రంగనాథ్ గారికి దూరమైందట.



























