Imandi Ramarao : విజయ్ దేవరకొండ, మహేష్ బాబు మధ్య చిచ్చు పెట్టిన పూరీ జగన్నాథ్… రౌడీ బాయ్ ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య వార్..!

0
95

Imandi Ramarao : దర్శకుడు పూరీ జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ అనగానే గుర్తొచ్చేది ‘పోకిరి’ సినిమా. ఈ సినిమా టాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నింటినీ చెరిపి చరిత్ర సృష్టించింది. పూరీ డైరెక్షన్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తరువాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘బిజినెస్ మాన్’ సినిమా కూడా బాగుంటుంది అయితే పోకిరి అంత పెద్ద హిట్ కాదు. కానీ ఎందుకో ఆ తరువాత వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. నిజానికి పూరీ ‘జనగణమన’ సినిమా మహేష్ తో తీస్తాడని అందరూ అనుకున్నా ఇపుడు విజయ్ దేవరకొండ తో స్టార్ట్ చేస్తున్నాడు. ఇంతదాకా బాగున్నా ఇక్కడే రౌడీ బాయ్ కామెంట్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించాయి.

మహేష్ కన్నా గొప్పగా సినిమాలో చేస్తా…

లైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ అందరూ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది నిర్వహించారు. అయితే అందులో మళ్ళీ విజయ్ కాంబినేషన్ లోనే జనగణమన సినిమా తీస్తున్న విషయం గురించి విజయ్ చెబుతూ ఈ సినిమా మొదట మహేష్ బాబు తో తీయాలని అనుకున్నానరట కానీ నాతో చేస్తున్నారు, ఆయన కంటే గొప్పగా సినిమా చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ మాటాడాడు. కానీ దీనిపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. విజయ్ కి ఆటిట్యూడ్ ఎక్కువైంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ విషయం మీద ఇమంది రామారావు విశ్లేషిస్తూ పూరీ జగన్నాథ్ ఎందుకో మహేష్ కి, మెగాస్టార్ వంటి వారికి కనెక్ట్ అవ్వలేదు.

మంచి హిట్స్ ఇచ్చినా మళ్ళీ కాంబినేషన్ రిపీట్ చేయలేదు. ఇక చిరు తో ‘ఆటో జానీ’ సినిమా చేయాల్సి ఉన్నా అది వర్క్ అవుట్ అవలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో మొదట జనగణమన చేయాలని పూరీ అనుకున్నా కుదరలేదు. ఇక మహేష్ తో చేయాలనుకున్నపుడు మహేష్ కూడా ఒప్పుకున్నాడు. కానీ పూరీ సెట్ చేసుకోలేదు. ఇక ప్లాప్ సినిమాలతో ఉన్నపుడు మహేష్ రిస్క్ చేయాలని అనుకోలేదు అలా జనగణమన సినిమాను వదులుకున్నాడు, ఇపుడు ఆ సినిమాను విజయ్ తో తీస్తున్నాడు. ఇక ఈ విషయంలో నేను బాగా చేస్తాను అని చెబితే పోయేదానికి అంతకంటే గొప్పగా ప్రయత్నిస్తానని చెప్పడం వల్ల ఇదంతా వచ్చింది అంటూ అభిప్రయపడ్డారు.