Imandi Ramarao : అన్ స్టాపబుల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ ఒక్క షోతో ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక రేటింగ్స్ లోనూ రికార్డులు సృష్టించింది అన్ స్టాపబుల్. సీజన్ వన్ ఆ రేంజ్లో హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఇక సెకండ్ సీజన్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు ప్రేక్షకుడు కూడా ఎదురుచూస్తున్నాడు. ఇక అన్ స్టాపబుల్ సీజన్ రెండు మొదటి ఎపిసోడ్ త్వరలో రాబోతోంది, దీనికి సంబంధించిన ప్రోమో కుడా విడుదల చేసారు. మొదటి ఎపిసోడ్ ఏకంగా తెలుగు దేశం అధినేత స్వయానా బాలయ్య కు బావ అయిన నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ లను పిలిచి బాలయ్య సందడి చేసారు. ఈ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాబోతోంది. అయితే ఈ సీజన్ లో ఎవరెవరు గెస్ట్ లుగా రాబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. మొదటి ఎపిసోడ్ కి సంబంధిచిన ప్రోమోనే యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో నిలిచింది.

మెగా బ్రదర్స్ షోకి రావడానికి సుముఖంగా లేరా…
ఇక ఈ సీజన్ గెస్ట్ ల గురించి ఒక్కోరోజు ఒక్కో రూమర్ వినిపిస్తోంది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సీజన్ లో రాబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ షోకి చిరంజీవి, పవన్ కళ్యాణ్ రావడానికి అంత సుముఖంగా లేరని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ బాలకృష్ణ షోలో అడిగే ప్రశ్నలు కొన్ని కాంట్రావెర్సీ గా ఉండటం వల్ల సమాధానలు చెప్పవలసి వస్తుందని చిరు షోకి రావడానికి ఆలోచిస్తున్నారంటూ అభిప్రాయపడ్డారు. చిరంజీవి ఎపుడూ సూటిగా సమాధానాలు చెప్పరు, డిప్లొమసీతో సమాధానాలు చెబుతారు. అలాంటి వ్యక్తిని కాంట్రావెర్సీ ప్రశ్నలు ఎదురైతే సమాధానాలు చెప్పడానికి ఇబ్బంది పడతారు.

అదీకాక అల్లు అరవింద్ మెగాస్టార్ తరువాత అల్లు అర్జున్ ని మెగాస్టార్ గా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు అందుకే మెగాస్టార్ రావాలని అనుకోవడం లేదు అంటూ అభిప్రాయపడ్డారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ రావడానికి సిద్ధంగా ఉన్నా రావడానికి బాలకృష్ణ పిలవకుండా ఉన్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడు పిలవడానికి, కొడాలి నాని అన్ని మాటలు మాట్లాడుతుంటే ఎన్టీఆర్ వారించడం లేదనే కోపం ఆయనకు ఉంది అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మనసులో ఇది దాచేలేడు ఒక వేళ ఏదైనా కాంట్రావెర్సీ ప్రశ్న ఎదురైతే ఇబ్బంది పడతారు అందుకే ఆయన రావడానికి ఆలోచిస్తున్నాడు. కానీ పవన్ వస్తే షోకి బాగుంటుంది, అది ఆయన పొలిటికల్ కెరీర్ కి ప్లస్ అవుతుంది అంటూ చెప్పారు.































