Imandi Ramarao : సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరా దేవి గారు సెప్టెంబర్ 29 న తన స్వగృహంలో కన్నుమూశారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పలుమార్లు ఆసుపత్రికి వెళ్తూ వచ్చేవారు. అయితే మామూలుగా వెళ్లి వచ్చేస్తారు అని అందరూ అనుకున్నా ఈ సారి మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆవిడ మరణం కృష్ణ గారిని ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఇంతవరకు ఎపుడూ కృష్ణ గారి భార్య ఇందిర గారు మీడియా ముందుకు రావడం జరగలేదు. ఆవిడ గొప్ప వ్యక్తిత్వం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఒకసారి అప్పటి సంఘటనలు, విజయ నిర్మల గారితో కృష్ణ గారి పెళ్లి వంటి విషయాల గురించి చెప్పి విజయనిర్మల, ఇందిరా దేవి మధ్య ఉన్న సఖ్యత గురించి చెప్పారు.

విజయనిర్మల వద్ద మహేష్ బాబు…
కృష్ణ గారు విజయనిర్మల గారిని రెడో వివాహం చేసుకున్న సమయంలో ఇందిరా దేవి గారికి కృష్ణ గారికి మంజుల, రమేష్ బాబు జన్మించారు. ఇక విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్నా ఇందిరా గారికి సముచిత స్థానం ఇచ్చారు కృష్ణ గారు. వారి మధ్య ఏనాడూ గొడవలు రాకుండా చూసుకున్నారు. బయట పెద్దగా కనిపించని ఇందిర గారు ఐదుగురి పిల్లల బాధ్యత తీసుకుని కుటుంబం కోసం నిలబడితే విజయనిర్మల గారు కృష్ణ గారికి వెన్నంటే ఉండి ఆయనను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు.

ఇక రెండో పెళ్లి అనంతరం జన్మించిన మహేష్ ఇంకా మహేష్ చెల్లెళ్ళ విషయంలో కూడా కృష్ణ గారు ఆశ్రద్ధ చేయలేదు. ఇక విజయ నిర్మల కొడుకు నరేష్ కూడా వారితో కలిసి పెరిగాడు. విజయనిర్మల గారు మహేష్ ను కూడా తన కొడుకు లాగానే చూసుకోవడం విశేషం. ఇక కృష్ణ గారి ఆరోగ్యం గురించి విజయనిర్మల గారు ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. అందుకే మహేష్ కూడా ఆమె పట్ల చాలా గౌరవంగా ఉండేవారు. ఇలా కుటుంబంలో ఏమాత్రం చిన్న మనస్పర్తలు లేకుండా కుటుంబాన్ని నడిపారు కృష్ణ గారు. వారి వ్యక్తిగత జీవితాల్లోని ఏ చిన్న విషయం బయటికి వచ్చేది కాదు అంటూ ఇమంది గారు కృష్ణ గారి కుటుంబం గురించి చెప్పారు.

































