Imandi Ramarao : కృష్ణం రాజు గారు గత నెల 11 వ తేదీన మరణించారు. ఇక ఆయన మరణించక ముందే ఆయన తమ్ముడి కొడుకు ప్రభాస్ పెళ్లి జరుగుంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. బ్రతికున్నపుడు కృష్ణం రాజు చాలా సార్లు ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించారు. త్వరలో చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తన పిల్లలతో ఆడుకోవాలని ఉందంటూ చెప్పేవారు. ఇక ప్రభాస్ పెళ్లి గురించి ఆయన తన డైరీ లో అనుష్క తో పెళ్లి గురించి ఏదో రాసారంటూ ఆయన మరణించక పుకార్లు బయటికి వచ్చాయి. అయితే వాటిలో నిజమెంత అనే విషయంలో సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు గారు చెప్పారు.

ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది… నాగార్జున సలహా ఏమిటంటే…
ప్రభాస్ అనుష్క జంట తెర మీద వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇక బాహుబలి తరువాత వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనే అనుమానం అభిమానుల్లో మరింత బలపడింది. అయితే ఈ విషయంలో ఇప్పటివరకూ ఏమాత్రం క్లారిటీ లేదు. అయితే కృష్ణంరాజు గారు తన డైరీలో వీళ్ళ పెళ్లి గురించి రాసుకున్నారనే విషయంలో నిజం లేదు అంటూ ఇమంది గారు చెప్పారు. ఆయన నిజంగా వీళ్ళ పెళ్లి గురించి అనుకుని ఉంటే పెళ్లి చెసేవారు ఒప్పించి కానీ ఆయన ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించారు అంతే.

ఇక అనుష్క కు ప్రభాస్ కు మధ్య మంచి అనుబందం ఉంది, ఇద్దరూ తమ కుటుంబాలు కూడా సన్నిహితంగానే ఉన్నాయి. కానీ పెళ్లి గురించి ఎందుకు ఇంకా చెప్పడం లేదంటే ఏమైనా వాళ్ళ సినిమా ఇమేజ్ గురించి ఆలోచిస్తున్నానరేమో తెలియదు. ఇక అనుష్క కు ఇండస్ట్రీ లో నాగార్జున గాడ్ ఫాదర్, తాను ఏం చేయాలని అనుకున్నా ఆయనకు చెప్పే చేస్తుంది. నాగార్జున గారికి అనుష్క బినామి గా కూడా వ్యవహారిస్తోంది అంటూ చెప్పారు. వైజాగ్ వాసులకు ఎవరికైనా ఈ విషయం తెలుసు. అక్కడ ఆయనకు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. ఇంకా అనుష్క కు కూడా ఉన్నాయి అంటూ చెప్పారు.































